Sai Dharam Tej: హీరో అయ్యేందుకు ఎన్నో ఆఫీస్‌లకు తిరిగా.. నా ఫోటోల్ని పల్లీ బఠానీలు తినడానికి వాడే వారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరో సాయి దుర్గ తేజ్ తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ది ఫాస్ట్ & క్యూరియస్ – ఆటో ఎక్స్పో 2015 లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌లో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. సవాళ్లు ఎదురైతే మధ్యలోనే చేస్తున్న పనిని వదిలేయొద్దని, పట్టువదలకుండా ప్రయత్నిస్తూనే ఉండాలని సాయి దుర్గ తేజ్ అన్నారు. ఇంకా ఆయన ఈ కార్యక్రమంలో ఏం మాట్లాడరంటే ‘నేను నా ప్రొఫైల్ పట్టుకుని ఎన్నో ఆఫీస్‌లకు తిరిగాను. నా ఫోటోల్ని పల్లీలు, బఠానీలు తినడానికి వాడే వారు. అలా ఆఫీస్‌ల చుట్టూ తిరుగుతున్న టైంలో ఓ సారి మంచు మనోజ్ గారి ఆఫీస్‌లో వైవీఎస్ చౌదరీ గారు చూశారు. అలా ‘రేయ్’ చిత్రం ప్రారంభమైంది. కానీ ఆ మూవీ షూటింగ్ టైంలో చాలా ఆర్థిక సమస్యలు వచ్చాయి.
Also Read :Chiranjeevi : వీసీ సజ్జనార్ ను కలిసిని మెగాస్టార్ చిరంజీవి
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
అయినా సరే పట్టువదలకుండా ప్రయత్నించాను. 2012లో ఓ సినిమా చేస్తున్న టైంలోనే ఓ ప్రముఖ నటులు చనిపోయారు. మళ్లీ 2013లో జగపతి బాబు గారితో రీ షూట్ చేశాం. పొలిటికల్ రీజన్స్ వల్ల ఆ సినిమా కూడా ఆలస్యమైంది. అలా ఎన్ని సమస్యలు వచ్చినా కూడా నా కలల్ని మాత్రం వదిలి పెట్టలేదు. నాకు పవన్ కళ్యాణ్ గారు ఓ గురువులాంటి వారు.. చిన్నప్పటి నుంచి నన్ను గైడ్ చేస్తూనే ఉన్నారు.. ప్రతీ విషయంలో నన్ను ఎంకరేజ్ చేస్తుంటారు.. యాక్టింగ్ ట్రైనింగ్, జిమ్నాస్టిక్, డ్యాన్స్, కిక్ బాక్సింగ్ ఇలా అన్నింట్లోనూ నన్ను గైడ్ చేశారు. కాలేజ్‌లో ఉండే ఫేవరేట్ టీచర్‌లా నాకు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ సపోర్ట్ చేస్తుంటారు. నేను ప్రతీ సిట్యువేషన్‌ను లైటర్ వేలోనే తీసుకుంటాను. ఏదీ కూడా సీరియస్‌గా తీసుకోను. ఎంత బ్యాడ్ జరిగినా కూడా నవ్వుతూ ఆ సిట్యువేషన్‌ను దాటేస్తుంటాను. నేను హాస్పిటల్ ఉన్న తరువాత బయటకు వచ్చాను.
Also Read :Ari: శ్రీకాంత్ అయ్యంగార్ సినిమా పోస్టర్ల తొలగింపు.. దర్శకుడికి బీజేపీ కేంద్ర మంత్రి ప్రశంసలు
అందరూ అడుగుతూ ఉంటే.. కోమాలో ఉన్నాను అని చెప్పలేదు.. హాస్పిటల్‌కు అలా చిల్ అవ్వడానికి వెళ్లాను అని చెప్పాను. అందరూ హెల్మెట్ ధరించండి. వేగంగా వెళ్లకండి. జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి. యాక్సిడెంట్ తరువాత నాకు చాలా సమస్యలు వచ్చాయి. మాటలు కూడా సరిగ్గా వచ్చేవి కావు. నేను ఎన్నో పుస్తకాలు చదివే వాడిని.. ఎంతో వ్యాయామం చేసేవాడిని. నాకు ‘రిపబ్లిక్’ చాలా ఇష్టం. ఆ క్లైమాక్స్ కూడా నాకు చాలా ఇష్టం. అలాంటి కథలు మళ్లీ వస్తే నేను చేస్తాను. సోషల్ మీడియా అకౌంట్లకు ఆధార్‌ని లింక్ చేయడం మన బాధ్యత అని నేను అనుకుంటాను. చిరంజీవి గారితో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లాంటి స్టోరీని చేయాలనే కోరిక ఉంది. నా గ్యారేజ్‌లో ఉన్న రాయల్ ఎన్ ఫీల్డ్, మహేంద్ర థార్ అంటే నాకు చాలా ఇష్టం. 1968 షెల్బీ జీటీ 500 మస్టంగ్ మోడల్ కారు అంటే మరింత ఇష్టం. అది నాకు డ్రీమ్ కారు లాంటిది. కచ్చితంగా ఎప్పటికైనా సరే ఆ కారుని కొంటాను.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!