Sai Dharam Tej : : ఫ్లాపుల్లో ఉన్నప్పుడు నాకిచ్చిన ఆ డబ్బు ఎప్పటికీ మర్చిపోలేను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘జవాన్’, ‘కృష్ణమ్మ’ చిత్రాల నిర్మాత కృష్ణ తన పట్ల చూపించిన అభిమానాన్ని మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఎమోషనల్గా గుర్తుచేసుకున్నారు. తాజాగా ‘కాగితం పడవలు’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన.. తాను వరుస ఫ్లాపుల్లో ఉండి ఇబ్బంది పడుతున్న సమయంలో, తనను నమ్మి అడగకుండానే పూర్తి రెమ్యునరేషన్ ఇచ్చిన ఏకైక నిర్మాత కృష్ణ గారేనని వేదికపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కష్టకాలంలో తనకు అండగా నిలబడిన ఆ నిర్మాతను తన జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని సాయి తేజ్ చేసిన ఈ ఎమోషనల్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ మా ప్రొడ్యూసర్ కృష్ణ గురించి చెప్పాలి. 2017లో నాకు ‘జవాన్’ సినిమా ప్రొడ్యూస్ చేశారు. నాకు బాగా సపోర్ట్ చేసి, ఎక్కడా వెనకాడకుండా సినిమాకి కావాల్సిన ఖర్చు పెట్టేసి, ఎక్కడా ఏ కంప్లైంట్స్ లేకుండా ఆయన ఇందాక చెప్పినట్టు అందరికంటే ఫస్ట్ సెట్ లో ఉంటారు. ఆయన సపోర్ట్ మామూలు సపోర్ట్ కాదండి కృష్ణ గారు. నాతో మాట్లాడినందుకు చాలా చాలా థాంక్స్ అండి. అండ్ నా ఫేవరెట్ ప్రొడ్యూసర్.. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను.. నాకు ఫుల్ రెమ్యునరేషన్ ఇచ్చిన ప్రొడ్యూసర్ ఈయన ఒక్కలే. అంటే, ఆ టైంలో నేను కొద్దిగా ఫ్లాప్స్ లో ఉన్నాను.
Also Read
- Nani: నాని దర్శకత్వంలో సినిమా? హీరో కాకముందే పూర్తి స్క్రిప్ట్ రాసిపెట్టుకున్న న్యాచురల్ స్టార్!
- Kayadu Lohar: పురాణాల్లోని ఆ రాక్షసుడి భార్య పేరు నాకు పెట్టారు.. తండ్రి చేసిన పనిని బయటపెట్టిన కయాదు!
- Nandi Awards: త్వరలోనే నంది అవార్డుల వేడుక.. అమరావతిలో సినిమాలు, తిరుపతిలో టీవీ పురస్కారాలు!
- Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో ఊహించని ట్విస్ట్ ఇవ్వనున్న సుబ్బలక్ష్మి!
కానీ ఆ ఫ్లాప్స్ లో ఉన్నప్పుడు ఎవరూ అంత ఫుల్ రెమ్యునరేషన్ ఇవ్వలే, ఈయన మట్టుకు ఫుల్ రెమ్యునరేషన్ ఇచ్చిన వ్యక్తి నాకు. ఇది నా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. సో, ఆయనకి మీరందరూ సపోర్ట్ చేయండి, మంచి సినిమా తీశారు. ఆయన ఇంతకు ముందు తీసిన ‘కృష్ణమ్మ’ కూడా చాలా మంచి సినిమా. అండ్ ఇప్పుడు ఈ సినిమాతో వస్తున్నారు, సో డెఫినెట్ గా మీరందరూ కలిసి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. తలరాత.. ఇందాకైతే నేను మోసం అని చెప్పాను కానీ, అది కాదని.. మన మనసు ఏం రాసుకుంటే అది తలరాత. సారీ.. తలరాత రాసుకుంటే అది మనసు రాసుకున్నట్టే! సో ప్లీజ్ దయచేసి మీరందరూ సినిమా చూడండి, థియేటర్ కి రండి అండ్ ప్లీజ్ బ్లెస్ ద హోల్ టీమ్ అని సాయి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Sai Dharam Tej : : ఫ్లాపుల్లో ఉన్నప్పుడు నాకిచ్చిన ఆ డబ్బు ఎప్పటికీ మర్చిపోలేను
-
Nani: నాని దర్శకత్వంలో సినిమా? హీరో కాకముందే పూర్తి స్క్రిప్ట్ రాసిపెట్టుకున్న న్యాచురల్ స్టార్!
-
Abhishek Sharma: టీ20ల్లో అభిషేక్ శర్మ చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా..
-
Chiranjeevi : బ్లడ్ అమ్ముకున్నానని అవమానించారు..
-
Mohan Babu: “ఆ సినిమా చూస్తే మీరు నా దగ్గరకు కూడా రారు..” మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!