Site icon NTV Telugu

Rajni 173 : రజనీ సినిమాకు సాయి అభ్యంకర్.. కోలీవుడ్ లో హాట్ టాపిక్

Rajni 143

Rajni 143

రజనీకాంత్‌కు బక్కోడు ఉంటే బాలయ్యకు బండోడు ఉన్నాంటూ సరదాగా తమన్ ఓ సందర్భంగా వ్యాఖ్యానించాడు. అంటే వీరి కాంబోలో సినిమాలు వస్తున్నాయంటే సాంగ్స్, బీజీఎంతో సౌండ్ బాక్సులు బద్దలు కావాల్సిందే. మూవీ బ్లాక్ బస్టర్ హిట్ నమోదు చేయాల్సిందే. తమిళ్ లో తలైవాకు అనిరుధ్ మ్యూజిక్ ఇస్తున్నాడంటే వేరే లెవల్ హైప్ ఉంటుంది. కానీ ఈ మధ్య అనిరుధ్ కంపోజ్ చేసిన సినిమాలు ఫ్లాప్స్ టాక్ రావడంతో పాటు సాంగ్స్, బ్యాగ్రౌండ్ స్కోర్‌లో పదును తగ్గడంతో తలైవర్ 173 కోసం కంపోజర్‌ను మార్చబోతున్నారట. నయా సెన్సేషనల్ మ్యూజిషియన్ సాయి అభ్యంకర్‌ను తీసుకోబోతున్నారని టాక్.

Also Read : MEGA CLASS : మన శంకర వరప్రసాద్ సెకండ్ సింగిల్ ‘శశిరేఖ’ వచ్చేసింది..

ప్రైవేట్ ఆల్బమ్స్‌తో ఓవర్ నైట్ పాపులారిటీ సంపాదించాడు సాయి అభ్యంకర్. ఈ క్రేజే అతడికి వరుస ఆఫర్లను కట్టబెట్టాయి. స్టార్ కంపోజర్స్ కుళ్లుకునేలా బిగ్ ప్రాజెక్ట్స్‌కు సైన్ చేశాడు. ఒకటి కాదు రెండు కాదు సుమారు అరడజన్ చిత్రాలకు కమిటయ్యాడు. రాఘవ లారెన్స్ బెంజ్ సినిమాకు ఫస్ట్ సైన్ చేశాడు అభ్యంకర్. ఈ సినిమా ఇంకా రిలీజ్ కానే లేదు కానీ బల్టీ, డ్యూడ్‌తో అతడి పనితనం చూసిన మేకర్స్‌కు సాయి కంపోజింగ్‌పై నమ్మకాన్నికలగజేశాయి. ఏఆర్ రెహమాన్ వదిలేసిన సూర్య కరుప్పుతో సాయి అభ్యంకర్ దశ తిరిగింది. వరుసగా క్రేజీ ఆఫర్స్ పట్టేశాడు. అల్లు అర్జున్- అట్లీ భారీ బడ్జెట్ చిత్రంతో పాటు కార్తీ సినిమా మార్షల్‌కు కమిటయ్యాడు. ఇప్పుడు నెక్ట్స్ తలైవర్ 173కి సైన్ చేశాడని బజ్. లోకేశ్, సి సుందర్ వదిలేసిన డైరెక్షన్ ఛాన్స్ పార్కింగ్ ఫేం రామ్ కుమార్ బాలకృష్ణన్‌ను వరించిందని టాక్. కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈసినిమా అప్డేట్ రజనీకాంత్ పుట్టిన రోజైన డిసెంబర్ 12న వచ్చే ఛాన్స్ ఉంది. ఈ సినిమాకు సాయి అభ్యంకర్ సైన్ చేస్తే మరో బిగ్గెస్ట్ ఫిల్మ్ అతడి ఖాతాలో పడినట్లే.

Exit mobile version