ఎంత అందం ఉన్నా ఆవగింజంత అదృష్టం ఉండాలి అంటుంటారు మన పెద్దలు. రుక్సర్ థిల్లాన్ విషయంలో నిజమే అనిపించక మానదు. ఎప్పుడో తొమ్మిదేళ్ల క్రితం ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా సెటిలైపోదామని వచ్చిన భామ ఐడెంటిటీ కోసం పాటుపడాల్సిన బ్యాడ్ సిచ్చుయేషన్. కన్నడలో రన్ ఆంటోనీతో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ పంజాబీ గుడియా ఆ తర్వాత ఆకతాయితో టాలీవుడ్ గుమ్మం తొక్కింది. ఈసినిమా ఆడకపోయినా ఆమెకు నానితో కృష్ణార్జున యుద్దంలో నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. కానీ ఏం లాభం ఫేట్ మారలేదు.
Also Read : Suriya : సాలిడ్ లైనప్ సెట్ చేస్తున్న సూర్య
ఏబీసీడీ అంటూ అల్లు శిరీష్ తో ఆడిపాడింది రుక్సర్. ఇది బాక్సాఫీస్ దగ్గర మెప్పించలేదు. ఆ తర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఓ సినిమా చేస్తే భారీ డిజాస్టర్. ఇక లాభం లేదనుకుని మళ్లీ తెలుగు ఇండస్ట్రీతో టచ్‌లోకి వచ్చేసింది. విశ్వక్ సేన్‌తో అశోక వనంలో అర్జున కళ్యాణంలో నటించింది అమ్మడు. ఇదే ఆమె కెరీర్‌లో కాస్తో కూస్తో చెప్పుకోదగ్గ మూవీ. అటు కన్నడ, ఇటు హిందీలో వచ్చిన అవకాశాలు చేసుకుంటూ పోతుంది కానీ ఫేమ్ రాలేదు సరికదా ఇమేజ్ డౌన్ ఫాల్ అవుతుంది. లాస్ట్ ఇయర్ వచ్చిన నా సామి రంగాలో రాజ్ తరుణ్‌కు జోడీగా కనిపించింది రుక్సర్. ఇప్పుడు దిల్ రూబా అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మార్చి 14న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. ఈ సినిమా రుక్సర్ కెరీర్‌కు చాలా కీలకం కూడా. దిల్ రుబాతో హిట్ కొట్టి ట్రాక్ లోకి వస్తుందా లేదా అనేది మరి కొద్దీ రోజుల్లో తెలుస్తుంది.