NTV Telugu Site icon

Ruhani Sharma: రొమాంటిక్ సన్నివేశాలపై రుహానీ శర్మ ఎమోషనల్ నోట్..

Untitled Design (7)

Untitled Design (7)

రుహాణి శర్మ నటించిన ఆగ్రా సినిమాలో కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. గతేడాది వచ్చిన ఈ సినిమాలో రుహాణి శర్మ పరిధికి మించి శృంగార సన్నివేశాల్లో నటించింది. ఇటీవల ఓటీటీలో రిలీజైన ఈ సినిమాలో బోల్డ్ సన్నివేశాలను కొందరు రుహాణి శర్మ ప్రైవేట్ వీడీయోస్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. ఇందుకు సంబంధించి రుహాణి శర్మ క్లారిటీ ఇస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

Also Read: Re – Release: ఇక రెబల్ స్టార్ వంతు.. మురారి రికార్డు బ్రేక్ అవుతుందా..?

‘‘ఆగ్రా’లోని సన్నివేశాలు లీక్‌ అయినప్పటినుంచి నేను ఎంతో బాధలో ఉన్నాను. నా బాధను వివరించడానికి నిరుత్సాహం అనేది కూడా చిన్నమాటే. మా కష్టాన్ని, అంకితభావాన్ని విస్మరించి కేవలం కొన్ని సన్నివేశాలను మాత్రమే వైరల్‌ చేయడం అనేది నీతిమాలిన చర్య. ఆర్ట్ సినిమాలను రూపొందించడం సవాలుతో కూడుకున్న పని. వాటి కోసం నిద్ర లేని రాత్రులు ఎన్నో గడపాలి. అలాంటి చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రక్తాన్ని చెమటగా మార్చాలి. మా కష్టాన్ని, కన్నీళ్లను అర్థం చేసుకోకుండా కొందరు దానిగురించి తప్పుగా మాట్లాడుతున్నారు. అది సరైన పద్ధతి కాదు. ఈ చిత్రాన్ని కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ 2023లో ప్రదర్శించారు. అది మా యూనిట్ కు దక్కిన గౌరవం. ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. ఇంత గొప్ప సినిమాలో నటించినందుకు నాకెంతో గర్వంగా ఉంది. ఈ సినిమా శైలిని అందరూ గుర్తించాలని కోరుతున్నాను. కళ ఎప్పుడూ సులభంగా, సౌకర్యవంతంగా ఉండదు. ఎన్నో భావోద్వేగాలతో ముడిపడి ఉంటుంది. కళాకారుల శ్రమను వృథా చేయకండి. సినిమా గొప్పతనాన్ని చూడండి’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.

Show comments