Anirudh: సినిమాలను పక్కనబెట్టి సొంత రూట్ ఎంచుకున్న అనిరుధ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌత్ టు నార్త్.. తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సాంగ్స్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న మ్యూజిక్ సెన్సేషన్, రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ తన కెరీర్లో సరికొత్త అడుగు వేశారు. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా, ఇండిపెండెంట్ మ్యూజిక్ కి ఊతమిచ్చేలా ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. అనిరుధ్ తన సొంత ఇండిపెండెంట్ లేబుల్ ‘ఆల్బుకర్కీ రికార్డ్స్’, ప్రముఖ మ్యూజిక్ కంపెనీ ‘యూనివర్సల్ మ్యూజిక్ ఇండియా’ భాగస్వామ్యంతో రూపొందించిన క్రేజీ ప్రైవేట్ సాంగ్ ‘అరవింద్’ను తాజాగా విడుదల చేశారు. తెలుగు, తమిళ భాషల్లో ఒరిజినల్ పాప్, హిప్ హాప్ శైలిలో వచ్చిన ఈ ట్రాక్ ప్రస్తుతం మ్యూజిక్ లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
2012లో ‘వై దిస్ కొలవెరి డి’ అనే ఒకే ఒక్క పాటతో దేశవ్యాప్తంగా వైరల్ అయిన అనిరుధ్.. ఆ తర్వాత జైలర్, కూలీ, విక్రమ్, లియో, దేవర పార్ట్-1 మరియు బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘జవాన్’ చిత్రాలతో టాప్ పొజిషన్‌కు చేరుకున్నారు. అయితే, ఈ స్థాయికి రాకముందు ఆయన ఎదుర్కొన్న సవాళ్లు, పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. సరిగ్గా అదే పాయింట్‌తో ఈ ‘అరవింద్’ పాటను సిద్ధం చేశారు. ఈ పాటలో ‘అరవింద్’ అనే క్యారెక్టర్ మరెవరో కాదు.. అనిరుధ్ వ్యక్తిగత జీవితానికి, ఆయన గతానికి ఒక ప్రతిబింబం లాంటిది. ఎన్నో అవమానాలు, ఇబ్బందులు, ఈగోల నడుమ.. సంగీతంపై ఉన్న పిచ్చితో, ప్యాషన్‌తో తన జీవితాన్ని అంకితం చేసిన ఒక యువ మ్యూజిషియన్ కథే ఈ సాంగ్. నేటి డిజిటల్ యుగంలో ఒక పాటను సోషల్ మీడియాలో వదలడం చాలా సులభమే కావచ్చు, కానీ సౌత్ ఇండస్ట్రీలో ఒక ఇండిపెండెంట్ ఆర్టిస్ట్‌గా నిలదొక్కుకోవడం ఎంత కష్టమనేది ఈ పాటలో కళ్లకు కట్టినట్లు చూపించారు.
Also Read
తాజావార్తలు
-
Anirudh: సినిమాలను పక్కనబెట్టి సొంత రూట్ ఎంచుకున్న అనిరుధ్..
-
Honour Killing: గోల్కొండలో ఘోరం.. యూట్యూబర్‌ను వెంటాడి చంపిన వైనం..!
-
Spy Films: ‘వార్ 2’ ఫెయిల్యూర్.. స్పై సినిమాలకు కొత్త సవాల్!
-
CM Chandrababu: సింగపూర్‌లో సీఎం చంద్రబాబు పెట్టుబడుల వేట.. ప్రముఖ సంస్థలతో కీలక సమావేశాలు
-
POK: ‘మా ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోండి..’ పాక్ ఆక్రమిత కశ్మీర్లో కొత్త పోరాటం..!
ట్రెండింగ్
-
HMD Vibe 2 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
11,000mAh బ్యాటరీతో రికార్డు దిశగా HONOR X80 Pro Max ఎంట్రీ.!
-
IND vs PAK: భారత్-పాక్ మ్యాచ్‌లో ఆటగాళ్ల మధ్య గొడవ.. వీడియో వైరల్.. ఇంతకీ ఏం జరిగిందంటే?
-
INDw vs PAKW: భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. వరల్డ్‌కప్ చరిత్రలోనే సరికొత్త రికార్డులు!
-
Deepti Sharma Record: దీప్తి శర్మ వరల్డ్ రికార్డ్.. అంతర్జాతీయ మహిళల టీ20ల్లోనే తోపు!