Site icon NTV Telugu

Rithika Nayak: హ్యాట్రిక్ భామగా రితికా నాయక్

Rithika Nayak

Rithika Nayak

ప్రజెంట్ టాలీవుడ్‌లో ట్రెండ్ అవుతున్న బ్యూటీ రితికా నాయక్. ఈ వైబ్ బేబి.. మిరాయ్‌తో యూత్‌లో వైబ్ సృష్టించుకుంది. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేసింది. ఇప్పటి వరకు ఆమె త్రీ ఫిల్మ్స్ లో నటిస్తే.. మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. ఒక దాన్ని మించి మరోటి హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టడం విశేషం. విశ్వక్ సేన్ అశోక వనంలో అర్జున కళ్యాణంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ డిల్లీడాళ్… నెక్ట్స్ హాయ్ నాన్నలో నాని-మృణాల్ కూతురుగా స్మాల్ రోల్‌లో మెరిసింది.

Also Read :Bigg Boss : రీతూ చౌదరికి భారీ షాక్ ఇవ్వనున్న నాగార్జున..?

ఇక రీసెంట్లీ రిలీజైన మిరాయ్‌తో హ్యాట్రిక్ హిట్ కొట్టేసింది రితికానాయక్. ఈసినిమా హండ్రెడ్ క్రోర్ క్లబ్‌లోకి చేరింది. తేజా సజ్జా ఖాతాలో ఇది సెకండ్ హండ్రెడ్ క్రోర్ మూవీ కాగా, రితికాకు ఇదే ఫస్ట్. అలాగే ఓవర్సీస్‌లో కూడా బొమ్మ దూసుకెళుతోంది. ఇప్పటికే 2మిలియన్స్ మార్క్ దాటేసింది ఫిల్మ్. ఇక మేడమ్ చేతిలో టూ ఫిల్మ్స్ ఉన్నాయి. వాటిల్లో ఒకటి ఆనంద్ దేవరకొండతో డ్యూయెట్ అనే ఫిల్మ్ చేస్తోంది. ఏడాదిన్నర క్రితం స్టార్టైన ఈ సినిమా ఎంత వరకు వచ్చిందో అప్డేట్ లేదు. ఈ సినిమాను స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నాడు.

Also Read :Syria: సిరియాలో ఎన్నికలు లేకుండా కొత్త ప్రభుత్వం కొలువుదీరనుందా..!

ఇక ఇప్పుడు మెగా ఫ్యామిలీ వారసుడు వరుణ్ తేజ్ 15 మూవీలో నటిస్తోంది. ఇండో- కొరియన్ హారర్ డ్రామాగా రాబోతుంది. మేర్లపాక గాంధీ దర్శకుడు. యు.వి క్రియేషన్స్ మరియు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎఫ్3 తర్వాత వరుణ్ హిట్టే చూడలేదు. ఇటీవల తండ్రిగా ప్రమోటైన ఈ మెగా హీరోకి ఇప్పుడు అర్జెంటుగా హిట్ అవసరం. అటు బేబి తర్వాత గంగం గణేశాతో ప్లాప్ చూసిన ఆనంద్ కూడా హిట్ పడాలి. మరీ ఈ భామ.. వీరిద్దరికీ లేడీ లక్కుగా మారుతుందో లేదో తెలియాలంటే.. బొమ్మలు థియేటర్లలోకి వచ్చేంత వరకు ఆగాల్సిందే.

Exit mobile version