Rithika Nayak: హ్యాట్రిక్ భామగా రితికా నాయక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజెంట్ టాలీవుడ్‌లో ట్రెండ్ అవుతున్న బ్యూటీ రితికా నాయక్. ఈ వైబ్ బేబి.. మిరాయ్‌తో యూత్‌లో వైబ్ సృష్టించుకుంది. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేసింది. ఇప్పటి వరకు ఆమె త్రీ ఫిల్మ్స్ లో నటిస్తే.. మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. ఒక దాన్ని మించి మరోటి హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టడం విశేషం. విశ్వక్ సేన్ అశోక వనంలో అర్జున కళ్యాణంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ డిల్లీడాళ్… నెక్ట్స్ హాయ్ నాన్నలో నాని-మృణాల్ కూతురుగా స్మాల్ రోల్‌లో మెరిసింది.
Also Read :Bigg Boss : రీతూ చౌదరికి భారీ షాక్ ఇవ్వనున్న నాగార్జున..?
Also Read
ఇక రీసెంట్లీ రిలీజైన మిరాయ్‌తో హ్యాట్రిక్ హిట్ కొట్టేసింది రితికానాయక్. ఈసినిమా హండ్రెడ్ క్రోర్ క్లబ్‌లోకి చేరింది. తేజా సజ్జా ఖాతాలో ఇది సెకండ్ హండ్రెడ్ క్రోర్ మూవీ కాగా, రితికాకు ఇదే ఫస్ట్. అలాగే ఓవర్సీస్‌లో కూడా బొమ్మ దూసుకెళుతోంది. ఇప్పటికే 2మిలియన్స్ మార్క్ దాటేసింది ఫిల్మ్. ఇక మేడమ్ చేతిలో టూ ఫిల్మ్స్ ఉన్నాయి. వాటిల్లో ఒకటి ఆనంద్ దేవరకొండతో డ్యూయెట్ అనే ఫిల్మ్ చేస్తోంది. ఏడాదిన్నర క్రితం స్టార్టైన ఈ సినిమా ఎంత వరకు వచ్చిందో అప్డేట్ లేదు. ఈ సినిమాను స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నాడు.
Also Read :Syria: సిరియాలో ఎన్నికలు లేకుండా కొత్త ప్రభుత్వం కొలువుదీరనుందా..!
ఇక ఇప్పుడు మెగా ఫ్యామిలీ వారసుడు వరుణ్ తేజ్ 15 మూవీలో నటిస్తోంది. ఇండో- కొరియన్ హారర్ డ్రామాగా రాబోతుంది. మేర్లపాక గాంధీ దర్శకుడు. యు.వి క్రియేషన్స్ మరియు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎఫ్3 తర్వాత వరుణ్ హిట్టే చూడలేదు. ఇటీవల తండ్రిగా ప్రమోటైన ఈ మెగా హీరోకి ఇప్పుడు అర్జెంటుగా హిట్ అవసరం. అటు బేబి తర్వాత గంగం గణేశాతో ప్లాప్ చూసిన ఆనంద్ కూడా హిట్ పడాలి. మరీ ఈ భామ.. వీరిద్దరికీ లేడీ లక్కుగా మారుతుందో లేదో తెలియాలంటే.. బొమ్మలు థియేటర్లలోకి వచ్చేంత వరకు ఆగాల్సిందే.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!