Site icon NTV Telugu

Rishab Shetty : కాంతార హిట్ రిషబ్ శెట్టి కెరీర్ కీలకం.. కారణం ఇదే

Rishab Shetty

Rishab Shetty

కేజీఎఫ్ సిరీస్, కాంతార చిత్రాల తర్వాత చందన సీమ రూపు రేఖలు పూర్తిగా మారిపోయాయి. పాన్ ఇండియా లెవల్లో శాండిల్ వుడ్ తన స్థాయిని పెంచుకునేందుకు గట్టిగానే ప్లాన్ చేస్తోంది. థింగ్ బిగ్ అనే కాన్సెప్టుతో భారీ ప్రయోగాలు చేస్తోంది. అందులో భాగంగా వస్తున్న ఫిల్మ్ కాంతార ప్రీక్వెల్. రిషబ్ శెట్టి హీరో కం దర్శకుడిగా డ్యూయల్ రోల్ పోషించిన కాంతార చాప్టర్ వన్ అక్టోబర్ 2న దసరా కానుకగా వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతుంది. ఇదేటైంలో రిషబ్ ముందు కొన్ని టార్గెట్స్ వేచి చూస్తున్నాయి.

Also Read : Ranveer Singh : మరో సౌత్ దర్శకుడి రెండేళ్లు టైం వేస్ట్ చేసిన రణవీర్.. ఎవరంటే?

కాంతారతో రీజనల్ స్థాయి నుండి పాన్ ఇండియా స్థాయికి ఎదిగాడు రిషబ్ షెట్టి. 2022లో రూ. 13 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా రూ. 450 కోట్లను వసూలు చేసింది. కేజీఎఫ్ ఫస్ట్‌పార్ట్‌ కలెక్షన్లను క్రాస్‌చేసి శాండిల్ వుడ్‌లో హయ్యెస్ట్ గ్రాసర్‌గా రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. అప్పటికే కేజీఎఫ్2తో వెయ్యి కోట్ల మార్క్ చూసిన శాండిల్ వుడ్‌కు ఇది మరింత బూస్టర్ అయ్యింది. కానీ ఆ తర్వాత కన్నడ ఇండస్ట్రీలో ఆ రేంజ్‌లో సత్తా చాటే సినిమా రాలేదు. ఇప్పుడు వస్తున్న కాంతార ప్రీక్వెల్‌ ముందు బిగ్ టాస్క్ ఎదురుచూస్తోంది. రూ. 125 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ. 500 క్రోర్స్‌ టార్గెట్‌గా వస్తోంది.  కాంతారతో రిషబ్ పాన్ ఇండియా ఐడెంటిటీని సొంతం చేసుకోవడమే కాదు.. ఇతర ఇండస్ట్రీల్లోనూ ఆఫర్లును కొల్లగొట్టాడు. ఇటు టాలీవుడ్‌ అటు బాలీవుడ్‌పై ఏకకాలంలో ఫోకస్ చేస్తున్నాడు. చత్రపతి శివాజీ జీవిత చరిత్ర ఆధారంగా ఓ బాలీవుడ్ మూవీకి కమిటైన రిషబ్ తెలుగులో నేరుగా జై హనుమాన్‌తో పాటు నాగ వంశీ ప్రొడక్షన్‌లో ఓ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అంతేకాదు.  తారక్- నీల్ ప్రాజెక్టులో స్పెషల్‌ అప్పియరెన్స్‌ ఇస్తున్నాడు. రిషబ్ కమిటైన సినిమాలపై ఎఫెక్ట్ పడకూడదనుకుంటే కాంతార ప్రీక్వెల్ బ్లాక్ బస్టర్ కావాల్సిందే. అక్టోబర్ 2న వస్తున్న ఈ ఫిల్మ్ ఎన్ని టార్గెట్స్ రీచవుతుందో చూడాలి.

Exit mobile version