Rishab Shetty : కాంతార హిట్ రిషబ్ శెట్టి కెరీర్ కీలకం.. కారణం ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేజీఎఫ్ సిరీస్, కాంతార చిత్రాల తర్వాత చందన సీమ రూపు రేఖలు పూర్తిగా మారిపోయాయి. పాన్ ఇండియా లెవల్లో శాండిల్ వుడ్ తన స్థాయిని పెంచుకునేందుకు గట్టిగానే ప్లాన్ చేస్తోంది. థింగ్ బిగ్ అనే కాన్సెప్టుతో భారీ ప్రయోగాలు చేస్తోంది. అందులో భాగంగా వస్తున్న ఫిల్మ్ కాంతార ప్రీక్వెల్. రిషబ్ శెట్టి హీరో కం దర్శకుడిగా డ్యూయల్ రోల్ పోషించిన కాంతార చాప్టర్ వన్ అక్టోబర్ 2న దసరా కానుకగా వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతుంది. ఇదేటైంలో రిషబ్ ముందు కొన్ని టార్గెట్స్ వేచి చూస్తున్నాయి.
Also Read : Ranveer Singh : మరో సౌత్ దర్శకుడి రెండేళ్లు టైం వేస్ట్ చేసిన రణవీర్.. ఎవరంటే?
Also Read
- RC17 : రామ్ చరణ్ - సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
- Jayant C Paranjee: ఆడదని ముందే తెలుసు.. పవన్ కళ్యాణ్ సినిమాపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!
- Anil Ravipudi : అనిల్ రావిపూడి చుట్టూ క్రేజీ రూమర్స్
- Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. 'ఉప్పెన' హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
కాంతారతో రీజనల్ స్థాయి నుండి పాన్ ఇండియా స్థాయికి ఎదిగాడు రిషబ్ షెట్టి. 2022లో రూ. 13 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా రూ. 450 కోట్లను వసూలు చేసింది. కేజీఎఫ్ ఫస్ట్‌పార్ట్ కలెక్షన్లను క్రాస్‌చేసి శాండిల్ వుడ్‌లో హయ్యెస్ట్ గ్రాసర్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. అప్పటికే కేజీఎఫ్2తో వెయ్యి కోట్ల మార్క్ చూసిన శాండిల్ వుడ్‌కు ఇది మరింత బూస్టర్ అయ్యింది. కానీ ఆ తర్వాత కన్నడ ఇండస్ట్రీలో ఆ రేంజ్‌లో సత్తా చాటే సినిమా రాలేదు. ఇప్పుడు వస్తున్న కాంతార ప్రీక్వెల్ ముందు బిగ్ టాస్క్ ఎదురుచూస్తోంది. రూ. 125 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ. 500 క్రోర్స్ టార్గెట్‌గా వస్తోంది. కాంతారతో రిషబ్ పాన్ ఇండియా ఐడెంటిటీని సొంతం చేసుకోవడమే కాదు.. ఇతర ఇండస్ట్రీల్లోనూ ఆఫర్లును కొల్లగొట్టాడు. ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్‌పై ఏకకాలంలో ఫోకస్ చేస్తున్నాడు. చత్రపతి శివాజీ జీవిత చరిత్ర ఆధారంగా ఓ బాలీవుడ్ మూవీకి కమిటైన రిషబ్ తెలుగులో నేరుగా జై హనుమాన్‌తో పాటు నాగ వంశీ ప్రొడక్షన్‌లో ఓ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అంతేకాదు. తారక్- నీల్ ప్రాజెక్టులో స్పెషల్ అప్పియరెన్స్ ఇస్తున్నాడు. రిషబ్ కమిటైన సినిమాలపై ఎఫెక్ట్ పడకూడదనుకుంటే కాంతార ప్రీక్వెల్ బ్లాక్ బస్టర్ కావాల్సిందే. అక్టోబర్ 2న వస్తున్న ఈ ఫిల్మ్ ఎన్ని టార్గెట్స్ రీచవుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Jantar Mantar Protest 2026: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు.. పలువురు నిరసనకారులు అదుపులోకి
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే అరెస్ట్..? ‘చాయ్ తాగుదాం రండి’ అంటూ..
-
AP Drought Mandals 2026: కరువు కోరల్లో ఏపీ.. 21 జిల్లాల్లో 388 మండలాలు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
-
RC17 : రామ్ చరణ్ – సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
-
Dhoni-Rohit: ధోనీని చూసి భయపడ్డా.. రోహిత్ సూపర్.. టీమిండియా కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?