‘కాంతార’ సిరీస్‌తో దేశవ్యాప్తంగా సూపర్ స్టార్ రేంజ్‌లోకి వెళ్లిన కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి ఇప్పుడు టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార: చాప్టర్ 1’ చిత్రం దేశవ్యాప్తంగా 800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండియన్ సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానం దక్కించుకుంది. ఈ అద్భుత విజయంతో రిషబ్ శెట్టి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. దీంతో ఆయన నటించే తదుపరి సినిమాలపై ప్రేక్షకుల్లో, ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ‘హనుమాన్’ సీక్వెల్ ‘జై హనుమాన్’లో నటించనున్న ఆయన, ఈ ప్రాజెక్ట్ జనవరిలో సెట్స్‌పైకి వెళ్ళనుంది.
Also Read : Jailer 2 : ‘జైలర్ 2’లో మరో స్టార్ కమెడియన్ ఎంట్రీ – డబుల్ డోస్ కన్‌ఫర్మ్!
ఇదిలా ఉండగా, రిషబ్ శెట్టి తాజాగా మరో తెలుగు భారీ ప్రాజెక్ట్‌కి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారనే వార్త ఫిల్మ్‌నగర్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించబోతున్నారని సమాచారం. పీరియాడిక్ నేపథ్యంతో సాగే ఈ కథకు ‘ఆకాశవాణి’ ఫేమ్ దర్శకుడు అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహించే అవకాశం ఉందట. భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోయే ఈ సినిమాపై ఇప్పటికే టాలీవుడ్‌లో చర్చలు మొదలయ్యాయి. అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందని, రిషబ్ శెట్టి ఈసారికి ఏ రేంజ్‌లో అలరించబోతారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
