Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శాండల్ వుడ్ స్టార్ హీరో రిషబ్ శెట్టి అండ్ ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే మధ్య విభేదాలు మరొకసారి బయటపడ్డాయి. గతంలోనే ప్రొడక్షన్ హౌస్‌తో బాండింగ్ తెంచేసుకున్నాడు ఈ కన్నడ హీరో. హోంబలే కూడా హీరోతో కొర్రీలు పెట్టుకుంది. తాజాగా వీరి క్లాష్ ఇప్పుడు రచ్చకెక్కింది. ఈ వివాదం మళ్ళీ తెరపైకి రావడానికి రీజన్ ఏంటి? కన్నడ ఇండస్ట్రీలో మరోసారి హాట్ టాపిక్ అవుతుంది రిషబ్ శెట్టి అండ్ హోంబలే ఫిలిమ్స్ వివాదం. ‘కాంతార చాప్టర్ వన్’ రిలీజ్ తర్వాత మొదలైన కాంట్రవర్సీ మళ్ళీ రాజుకోవడానికి కారణమయ్యాడు హీరో రిషబ్ శెట్టి. ‘కాంతార’ మూవీ ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా కొన్ని ఫోటోలను షేర్ చేశాడు ఆ మూవీ హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి. కానీ, ఎక్కడా పోస్టర్లో హోంబలే లోగో గానీ, హ్యాష్‌ట్యాగ్‌లో ఆ సంస్థ పేరును కానీ యూస్ చేయలేదు. తాజాగా ‘కాంతార చాప్టర్ వన్’ విడుదలై ఈ అక్టోబర్ 2కి ఏడాది పూర్తి కాగా, ఓ వీడియోను విడుదల చేశాడు. సేమ్ అక్కడ కూడా అదే ఫార్మాట్ కంటిన్యూ చేశాడు హీరో.
రిషబ్ శెట్టి చేసిన ఈ పనికి కౌంటర్‌గా హోంబలే కూడా రంగంలోకి దిగింది. ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా రిషబ్ పోస్టర్ పెట్టినప్పటికీ, ఎక్కడా హీరో పేరు ప్రస్తావించలేదు. ‘కాంతార చాప్టర్ వన్’ ఇయర్ పూర్తయిన సందర్భంగా రిషబ్ పిక్ తీసేసి, ఏఐ కంటెంట్‌తో కూడిన టైగర్ పోస్టర్ పంచుకుంది. దీంతో రిషబ్ అండ్ హోంబలే ఫిలిమ్స్ మధ్య విభేదాలు మరింతగా ముదిరాయని మరోసారి ప్రూవ్ అయింది.’కాంతార చాప్టర్ వన్’ విషయంలో రిషబ్ అండ్ హోంబలేకు మధ్య ప్రాఫిట్ షేరింగ్ విషయంలో తేడా కొట్టిందని సమాచారం. అగ్రీమెంట్ ప్రకారం అతడికి చెల్లించాల్సిన అమౌంట్ ఇవ్వలేదని టాక్. వాటిని నిజం చేస్తూ, ఇంతకుముందే ఇన్‌స్టాలో హోంబలే, కాంతార అకౌంట్స్‌ని అన్‌ఫాలో చేశాడు హీరో. అదే టైంలో కొత్త నిర్మాణ సంస్థ ‘రిషబ్ శెట్టి ఫిలిమ్స్’ ఏర్పాటు చేయడం హాట్ టాపిక్ అయింది. దీంతో ‘కాంతార చాప్టర్ 2’ తీయాల్సిన టైంలో రిషబ్ చర్యలు, హోంబలేకు – హీరోకు మధ్య పొసగడం లేదన్న వార్తలు ఊపందుకున్నాయి. అలాగే రిషబ్ బర్త్‌డే సందర్భంగా విషెస్ కూడా చెప్పలేదు హోంబలే నిర్మాణ సంస్థ. కానీ, హీరోను మాత్రం హోంబలే ఇన్‌స్టాలో ఫాలో అవుతూ ఉండడం గమనార్హం.
Also Read
- Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? 'రణబాలి' సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
- Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా 'ఆదర్శ కుటుంబం'పై ఇంత సైలెన్స్ ఏంటి?
- Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
- The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై 'ది ప్యారడైజ్'లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
తాజావార్తలు
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!