మళ్ళీ మొదలైన ‘రైడర్’ మూవీ షూటింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ ప్రధాన మంత్రి హెచ్‌డీ దేవగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమార్ 2016లో ‘జాగ్వర్’ మూవీతో తెలుగు వారి ముందుకొచ్చాడు. ఆ తర్వాత కన్నడ సినిమాలు ‘సీతారామకళ్యాణం’, ‘కురుక్షేత్ర’లో నటించాడు. ‘కురుక్షేత్ర’ సినిమా తెలుగులోనూ డబ్ అయ్యింది. తాజాగా నిఖిల్ కుమార్ ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘ఒక లైలా కోసం’, ‘ఒరేయ్ బుజ్జిగా’ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు విజయ్ కుమార్ కొండా డైరెక్షన్ లో ‘రైడర్’ మూవీలో నటిస్తున్నాడు. కాశ్మీరా పరదేశి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని చంద్ర మనోహరన్ నిర్మిస్తున్నారు. లహరి మ్యూజిక్ సంస్థ ఈ చిత్రంతో నిర్మాణరంగంలోకి అడుగుపెట్టింది. అర్జున్ జన్య సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా శ్రీషా కుడువల్లి సినిమాటోగ్రాఫర్.
ఇప్పటికే విడుదలైన ‘రైడర్’ మోషన్‌పోస్టర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చిందని, ఆదివారం నుండి మూవీ చిత్రీకరణ తిరిగి ప్రారంభించామని నిర్మాత తెలిపారు. తెలుగు, కన్నడ భాషలలో రూపొందుతున్న ఈ చిత్రంలో దత్తన్న, అచ్యుత కుమార్, రాజేష్ నటరంగ, శోభరాజ్, నిహారిక, సంపద, అనూష ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
Gujarat: జానపద గాయకుడిపై లక్షల్లో నోట్ల వర్షం.. వీడియో వైరల్
-
Gold Demand : దక్షిణ భారతీయుల బంగారం సెంటిమెంట్‌ను మారుతుందా..?
-
Asaduddin Owaisi: బాబ్రీ మసీదులాగే భోజ్‌శాల తీర్పు.. సుప్రీంకు వెళ్తామన్న ఓవైసీ..
-
West Bengal: సువేందు దూకుడు.. ఆర్జీకర్ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్..
-
Karnataka: ఘోర విషాదం.. గుడికెళ్లి వస్తుండగా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!