Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Rgv Reacts To Mamata Banerjee Refusal To Resign After Bengal Defeat

RGV: దీదీ వర్సెస్ ఆర్జీవీ.. బెంగాల్ రాజకీయంపై ఆర్జీవీ షాకింగ్ ట్వీట్!

Published Date :May 6, 2026 , 4:12 pm
By Shiva Ganesh
RGV: దీదీ వర్సెస్ ఆర్జీవీ.. బెంగాల్ రాజకీయంపై ఆర్జీవీ షాకింగ్ ట్వీట్!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

RGV: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించాయి. 15 ఏళ్ల మమతా బెనర్జీ సుదీర్ఘ పాలనకు చరమగీతం పాడుతూ ఈ రాష్ట్రంలో బీజేపీ భారీ విజయాన్ని అందుకుంది. అయితే అనూహ్యంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు మమత నిరాకరించడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. దీనిపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు.

ఆర్జీవీ ఏమన్నారంటే..
ఎప్పుడూ వివాదాస్పద అంశాలపై స్పందించే ఆర్జీవీ, మమత తీరుపై విస్మయం వ్యక్తం చేశారు. “దశాబ్దాల రాజకీయ అనుభవం, 15 ఏళ్లు సీఎంగా ఉన్న మమతా బెనర్జీ ఇలా ప్రవర్తించడం నమ్మలేకపోతున్నాను. ప్రజాస్వామ్యం అంటేనే వ్యవస్థల కలయిక. అటువంటి వ్యవస్థలపై దాడి చేయడం అంటే ప్రజాస్వామ్యంపై దాడి చేయడమే. ఆమె ఈ నిజాన్ని ఎలా విస్మరిస్తున్నారు?” అంటూ ఎక్స్‌ (X) వేదికగా ఆయన ప్రశ్నించారు.

Also Read

  • PEDDI: 80ల నాటి విజయనగరం కోసం ఏకంగా 24 భారీ సెట్లు!
  • MAA: ‘మా’ పేరుతో మోసాలు.. నకిలీ సంఘాలపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సీరియస్ వార్నింగ్!
  • Peddi: కథ విన్నాక 25 నిమిషాల పాటు తేరుకోలేకపోయా!
  • Salman Khan: బాలీవుడ్ హిట్ జోడీ మళ్ళీ రిపీట్..
Add as a preferred
source on google

బెంగాల్‌లో ఏం జరిగిందంటే..
2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 207 స్థానాలను కైవసం చేసుకుని స్పష్టమైన మెజారిటీ సాధించింది. అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (TMC) కేవలం 80 స్థానాలకే పరిమితమైంది. దీంతో బెంగాల్‌లో రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. మెజారిటీ రాకపోయినా రాజీనామా చేసే ప్రసక్తే లేదని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. మంగళవారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. బీజేపీ, ఎన్నికల కమిషన్ కలిసి ఎన్నికలను లూటీ చేశాయని ఆమె ఆరోపించారు. “నేను ఓడిపోలేదు, రాజ్‌భవన్‌కు వెళ్లి రాజీనామా చేసే ప్రశ్నే లేదు. అధికారికంగా మమ్మల్ని ఓడించి ఉండవచ్చు కానీ, నైతికంగా మేమే విజేతలం” అని చెప్పారు. కౌంటింగ్ సమయంలో తనపై భౌతిక దాడి జరిగిందని, తన కడుపులో తన్నారని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. సీసీటీవీలను కావాలనే ఆపివేసి తన ఏజెంట్లపై దాడులు చేశారని మండిపడ్డారు.

ఇకపై ‘ఫ్రీ బర్డ్’..
తాను ఇకపై ఎలాంటి పదవుల్లో లేనని, ఒక సామాన్యురాలిగా ‘ఇండియా’ (INDIA) కూటమిని బలోపేతం చేస్తానని మమత తెలిపారు. “15 ఏళ్ల పాలనలో నేను ఒక్క పైసా జీతం గానీ, పెన్షన్ గానీ తీసుకోలేదు. ఇప్పుడు నేను ఒక స్వేచ్ఛా విహంగాన్ని (ఫ్రీ బర్డ్) అని చెప్పారు. ప్రజల కోసం పని చేస్తూనే ఉంటాను” అని ఆమె తెలిపారు. మరోవైపు బెంగాల్‌లో బీజేపీ సాధించిన చారిత్రాత్మక విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో అధికారం బదిలీ సజావుగా సాగుతుందా లేదా అనేది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది.

After so many DECADES in POLITICIS and 15 years as C M , I can’t believe that @MamataOfficial is ignoring that DEMOCRACY by it’s very DNA is about INSTITUTIONS and attacking them amounts to attacking DEMOCRACY

— Ram Gopal Varma (@RGVzoomin) May 6, 2026

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bengal Politics Update
  • BJP Win in Bengal
  • Mamata Banerjee
  • Mamata Banerjee resignation
  • Narendra Modi Bengal Win.

తాజావార్తలు

  • RGV: దీదీ వర్సెస్ ఆర్జీవీ.. బెంగాల్ రాజకీయంపై ఆర్జీవీ షాకింగ్ ట్వీట్!

  • Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?

  • Coalition Governments in India: సంకీర్ణ ప్రభుత్వాలు ఎంత వరకు నిలబడతాయి.. దేశ చరిత్ర ఏం చెబుతోంది.

  • Kerala Congress: కాంగ్రెస్ ఇరకాటం.. కేరళ మరో కర్ణాటక కాబోతోందా.?

  • PEDDI: 80ల నాటి విజయనగరం కోసం ఏకంగా 24 భారీ సెట్లు!

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions