Kashi Majili OTT: ‘కాశీ మజిలీ’తో రీఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్.. ‘ఈటీవీ విన్’లో ఎమోషనల్ లవ్ స్టోరీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kashi Majili OTT: చాలా కాలం తర్వాత నటి రేణు దేశాయ్ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈసారి థియేటర్లో కాదు.. నేరుగా ఓటీటీలో. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘కాశీ మజిలీ’ (Kashi Majili) వెబ్ ఎపిసోడ్ సెప్టెంబర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ లో ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో రేణు దేశాయ్ నటించడంతో పాటు కథ, కథనం, సంభాషణలు కూడా అందించడం విశేషం. రేణు దేశాయ్ ప్రధాన పాత్రలో నటించిన ‘కాశీ మజిలీ’ లఘు చిత్రం నేడు (2026 సెప్టెంబర్ 13, ఆదివారం) ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ETV Winలో స్ట్రీమింగ్కు వచ్చింది. ‘కథా సుధా’లో భాగంగా రూపొందిన ఈ సినిమా ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా రూపొందింది. హృదయానికి హత్తుకునే కథలను అందించాలనే ఉద్దేశంతో ఈటీవీ విన్ ప్రత్యేకంగా తీసుకొస్తున్న ‘కథాసుధ’ సిరీస్‌లో భాగంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘కొన్ని ప్రేమకథలకు మరో అవకాశం దక్కాలి’ అనే ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తో, మలయాళ మూవీ ‘చిన్న చిన్న ఆశై’ కథ ఆధారంగా ఈ సరికొత్త లఘు చిత్రాన్ని రూపొందించారు. ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలో చివరిసారిగా కనిపించిన రేణు దేశాయ్, దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ఈ ప్రాజెక్ట్‌తో డిజిటల్ ఓటీటీ రంగంలోకి గ్రాండ్‌గా అడుగుపెట్టారు.
ఈ ప్రాజెక్ట్‌కు ఉన్న మరో విశేషం ఏమిటంటే, ఇందులో రేణు దేశాయ్ కేవలం నటిగా మాత్రమే కాకుండా.. ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ కూడా అందించారు. పవిత్రమైన వారణాసి (కాశీ) ఘాట్ బ్యాక్‌డ్రాప్‌లో ఆధ్యాత్మికత, ప్రేమానుబంధాల థీమ్స్ తో ఈ ఎమోషనల్ రొమాంటిక్ డ్రామా సాగుతుంది. దాదాపు 600 యాడ్స్‌కు పైగా తెరకెక్కించిన ప్రసిద్ధ యాడ్ ఫిల్మ్ మేకర్ యమునా కిషోర్ ఈ చిత్రంతో దర్శకుడిగా మారగా, జేకే ఆర్ట్స్ బ్యానర్‌పై జగదీష్ కుమార్ కాళ్లూరు నిర్మించారు. ఇందులో రేణు దేశాయ్ సరసన యువ నటుడు శంకర్ ఇందుచూడన్ కథానాయకుడిగా నటించారు. దివంగత లెజెండరీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గతంలో రచించిన ఒక అద్భుతమైన పాటను ఈ సినిమాలో ఉపయోగించడం ఈ మూవీకి హైలెట్ గా నిలిచింది. మరెందుకు ఆలస్యం ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామా ఫ్యాన్స్ ఇంట్లోనే కూర్చొని ఎంచక్కా చూసేయచ్చు.
Also Read
- Bigg Boss Hosts Salary 2026: బిగ్ బాస్ హోస్ట్‌లకు కోట్లలో రెమ్యునరేషన్, ఎవరు ఎంత తీసుకుంటున్నారంటే?
- Vishwambhara vs Kaaka: 'విశ్వంభర' vs 'కాకా'… సంక్రాంతి 2027 రేసులో మెగాస్టార్ ఏం చేయబోతున్నారు?
- Irumudi OTT: ఓటీటీలోకి మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు అంటే?
- Bigg Boss Telugu 10: 'బిగ్ బాస్ తెలుగు 10'లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
తాజావార్తలు
-
Kashi Majili OTT: ‘కాశీ మజిలీ’తో రీఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్.. ‘ఈటీవీ విన్’లో ఎమోషనల్ లవ్ స్టోరీ!
-
19th BRICS Summit in China: 19వ BRICS సమ్మిట్ చైనాలో.. అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రకటన
-
Bigg Boss Hosts Salary 2026: బిగ్ బాస్ హోస్ట్‌లకు కోట్లలో రెమ్యునరేషన్, ఎవరు ఎంత తీసుకుంటున్నారంటే?
-
Osama Bin Laden: సీఐఏ సంచలన నివేదిక.. 9/11 కంటే ముందే భారత్‌లో దాడులకు ఒసామా బిన్ లాడెన్ ప్లాన్..
-
ISRO IPRC Recruitment 2026: ఇస్రోలో ఉద్యోగాలు.. 10వ తరగతి, ITI, డిప్లొమా అర్హతతో అప్లై చేయండి!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!