NTV Telugu Site icon

Renu Desai: పవన్ తో వెళతానన్న ఆద్య.. అందుకే ఒప్పుకున్నానంటూ రేణు దేశాయ్ షాకింగ్ రియాక్షన్

Pawan Aadya Renu Desai

Pawan Aadya Renu Desai

Renu Desai Comments on Aadya spending time with Pawan Kalyan: పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ గతంలో ప్రేమించి, వివాహం చేసుకొని విడిపోయిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ మరో వివాహం చేసుకుంటే రేణు దేశాయ్ మాత్రం రెండో వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకుని కూడా వెనక్కి తగ్గింది. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ పిల్లలు ఆధ్యా, అకిరా నందన్ రేణు దేశాయ్ వద్దనే పెరుగుతున్నారు. అయితే తండ్రిని కలవాలనుకున్నప్పుడల్లా ఈ పిల్లలు ఇద్దరు తమ తండ్రి దగ్గరికి వెళ్లి వస్తూ ఉంటారు. అయితే తాజాగా స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆద్య తన తండ్రి పవన్ కళ్యాణ్ తో గడిపింది.

Harish Shankar: హరీష్ శంకర్ మొహమాటానికి పోయి ఇరుక్కున్నాడా?

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తన కుమార్తె ఆద్యతో కలిసి తీసుకున్న సెల్ఫీ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా ఇదే విషయం మీద రేణు దేశాయ్ కూడా స్పందించింది. నాన్నతో కలిసి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి వెళ్ళనా అని ఆద్య అడిగింది. ఆమె అలా అడగడం నాకు చాలా సంతోషం అనిపించింది. వాళ్ల నాన్నతో సమయం గడపడమే కాక ఒక కీలక హోదాలో ఉన్న వ్యక్తి ఎంత బిజీ షెడ్యూల్లో ఉంటారు? ఎంత బిజీ బిజీ లైఫ్ గడుపుతారో ఆమెకు తెలియాలి అని నాకు అనిపించింది. అంతేకాదు ఏపీ ప్రజల కోసం తన తండ్రి చేస్తున్న సేవలు సైతం ఆద్య చూడాలి అని నేను అనుకున్నాను. అందుకే నాకు ఆమె వెళతాను అనగానే పర్మిషన్ ఇచ్చేయాలి అనిపించి వెళ్లి రమ్మని చెప్పాను అని రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది. రేణు దేశాయ్ ఈ మధ్యలోనే సినిమాల్లో బిజీ అవ్వాలని ప్రయత్నిస్తున్నా ఆమెకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఆమె చివరిగా చేసిన టైగర్ నాగేశ్వరరావు సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు.

Show comments