NTV Telugu Site icon

Release Clash : 2025 సంక్రాంతికి బలయ్య – చిరు వార్ తప్పేలా లేదు..

Bala Churo

Bala Churo

2025 సంక్రాంతికి టాలీవుడ్ లో మళ్ళి స్టార్ హీరోల పోటీ తప్పేలా లేదు. ఒకరిమీద ఒకరు పోటీగా రిలీజ్ చేసేలా ఉంది పరిస్థితి చూస్తుంటే. మెగాస్టార్ చిరంజీవి యంగ్ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న విశ్వంభర వచ్చే ఏడాది పొంగల్ రిలీజ్ అని గతంలో ప్రకటించారు. అదే దారిలో మరొక సీనియర్ హీరో వెంకీ హీరోగా, అనిల్ రావిపూడి ‘ సంక్రాంతికి వస్తున్నాం’ పొంగల్ రిలీజ్ అని ప్రకటించారు. వీటితో పాటు బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలయ్య సినిమా కూడా రెడీగా ఉంది.

Also Read : Official : భగవంత్ కేసరి రీమేక్ హక్కులు కొనుగోలు చేసిన తమిళ హీరో..

వాస్తవానికి బాబీ బాలయ్య సినిమా డిసెంబరు 20న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసారు. కానీ ఇప్పుడు అక్కడ రామ్ చరణ్ రానుంది, భారీ బడ్జెట్ కావడంతో సోలో రిలీజ్ కావాలనుకోడవంతో బాలయ్య నిర్మాతలు సంక్రాంతికి వెళ్లేలా ప్లాన్ చేసారు. అదే సంక్రాంతికి రవితేజ సినిమా కుడా ఉంది. బాలయ్య రవితేజ సినిమాలను నిర్మిస్తుంది సితార ఎంటర్టైన్మెంట్స్. ఇప్పుడు రవితేజ సినిమాను సమ్మర్ కు పోస్ట్ పోన్ చేయనున్నారు సితార వారు.అలాగే అక్కినేని నాగార్జున బంగార్రాజు – 3 ,సందీప్ కిషన్, త్రినాధ్ రావ్ నక్కిన ‘మజాకా’ కూడా పొంగల్ రేస్ లోఉన్నాయి. అయితే బాలయ్య సినిమాను జనవరి 12న రిలీజ్ చేసేందుకు ఫిక్స్ అయ్యారట నిర్మాతలు. అదే జరిగితే బాలయ్య – చిరు పొంగల్ ఫైట్ మరోసారి తప్పదు. 2023 పొంగల్ కూడా వీరసింహారెడ్డి, వాల్తేర్ వీరయ్య పోటాపోటీగా వచ్చి సూపర్ హిట్ సాధించాయి. వచ్చే ఏడాది కూడా బాలయ్య చిరు సినిమాలతో పందెం కోళ్లలాగా బరిలో దిగనున్నారు ఈ ఇద్దరు స్టార్ హీరోలు.

Show comments