NTV Telugu Site icon

‘కె.జి.ఎఫ్‌. -2’ ఆలస్యానికి అదే కారణమా!?

1 Million Comments for KGF-2 Teaser

యశ్ హీరోగా రూపుదిద్దుకున్న ‘కేజీఎఫ్’ చాప్టర్ 1 గ్రాండ్ సక్సెస్ సాధించిన నేపథ్యంలో చాప్టర్ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల తేదీని దర్శక నిర్మాతలు ఇంకా లాక్ చేయలేదు. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం లేకుండా ఉండి ఉంటే ఈ సినిమా ఇప్పటికే విడుదలై ఉండేది. కానీ పరిస్థితులు సహకరించక పోవడంతో విడుదల వాయిదా వేస్తున్నామని మాత్రమే మే మాసంలో నిర్మాత తెలిపారు. అయితే… ఇప్పటికీ కొత్త విడుదల తేదీని ప్రకటించకపోవడానికి ఓ కారణం ఉందని చిత్ర బృందం చెబుతోంది.

Read Also : అభిషేక్ బదులు రణబీర్ ని డాడీ అనుకున్న ఐశ్వర్య కూతురు!

ఇందులో అధేరా అనే బలమైన ప్రతినాయకుడి పాత్రను సంజయ్ దత్ చేస్తున్నారు. ఆయన అనారోగ్య కారణంగా చిత్రీకరణ సమయంలోనే షెడ్యూల్స్ కాస్తంత అటూ ఇటూ అయ్యాయి. ఇప్పుడు కూడా సంజయ్ దత్ డబ్బింగ్ కారణంగా కొంత ఆలస్యం అవుతోందట. ‘కేజీఎఫ్ -2’ హిందీ వర్షన్ కు తానే డబ్బింగ్ చెబుతానని సంజయ్ దత్ అంటున్నారట. ఆయన ఆ పనిని పూర్తి చేసిన తర్వాతే దక్షిణాది భాషల్లో ఆ పాత్రకు డబ్బింగ్ చెప్పించాల్సి ఉంటుంది. సంజయ్ దత్ ను, ఆయన వాయిస్ ను మ్యాచ్ చేసే డబ్బింగ్ ఆర్టిస్టులతో దానిని చెప్పించాలి. అందుకోసమే కాస్తంత సమయం పడుతోందని అంటున్నారు. బయటకు చెప్పకపోయినా… ‘కేజీఎఫ్ -2’ దసరా కానుకగా విడుదల చేసే ఆస్కారం ఉంది. కానీ గతంలోనే ఆ తేదీని ‘ట్రిపుల్ ఆర్’ మూవీ లాక్ చేసి పెట్టేసింది. అంతేకాదు… అనుకున్న తేదీకి ‘ట్రిపుల్ ఆర్’ను రిలీజ్ చేయాలని రాజమౌళి బృందం అహరహం శ్రమిస్తోంది. ఒకవేళ ‘ట్రిపుల్ ఆర్’ దసరాకు రావడం ఖాయమైతే మాత్రం ‘కేజీఎఫ్ -2’ కాస్తంత ముందుకో, వెనక్కో వెళుతుంది. లేదా ‘ట్రిపుల్ ఆర్’ వేరే తేదీకి వెళితే ‘కేజీఎఫ్ -2’ దసరాకు రాయడం పక్కా అంటున్నారు.