NTV Telugu Site icon

Re – Release: ఇక రెబల్ స్టార్ వంతు.. మురారి రికార్డు బ్రేక్ అవుతుందా..?

Untitled Design (6)

Untitled Design (6)

ప్రస్తుతం టాలీవుడ్ లో రీరిలీజ్ హవా కొనసాగుతుంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు బర్త్ డే కానుకగా మహేశ్ కెరీర్ లో కల్ట్ క్లాసిక్ అయినా మురారి4k మరోసారి రిలీజ్ చేసారు. ఈ చిత్రం రీరిలీజ్ లో కూడా భారీ కలెక్షన్స్ సాధించి అల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. తాజాగా ఈ నెల 22న మెగాస్టార్ పుట్టిన రోజున ఇంద్ర సినిమా రిలీజ్ చేసారు మేకర్స్. తాజాగా మరొక స్టార్ హీరో సినిమా రిలీరిజ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు ఫ్యాన్స్. అతడు మరెవరో కాదు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.

Also Read: Dil Raju : సరిపోదా శనివారం పై దిల్ రాజు సూపర్ కాన్ఫిడెంట్.. హిట్టు కొట్టేనా..?

ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు ప్రభాస్. ఇప్పుడు ఈ సినిమా రీరిలీజ్ కానుంది.  అక్టోబరు 23వ తేదీన ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రీరిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తోన్నారు. దింతో పాటుగా రెబల్ స్టార్ కెరీర్ లో డార్లింగ్ సినిమాకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు ఈ సినిమాను కూడా రీరిలీజ్ చేయనున్నట్టు టాక్. వీటిలో ఈశ్వర్ మాస్ సినిమా కాగా డార్లింగ్ క్లాస్ సినిమా.. ఇలా క్లాస్ మాస్ కలిపి ఒకేరోజు రెండు సినిమాలను రీరిలీజ్ కానుండడంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ప్రభాస్ పుట్టినరోజు కానుకగా రీరిలీజ్ అవుతున్న రెండు సినిమాలు కలెక్షన్ల పరంగా కూడా అదరగొట్టాలని అభిమానులు రెడీ అవుతున్నారు. ఈ రెండు సినిమాలలో ఏ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో ఎంత కలెక్షన్స్
రాబడతాయో చూడాలి.

Show comments