RC17లో రామ్ చరణ్‌కు జోడీగా ధురంధర్ బ్యూటీ.. లెక్కల మాస్టర్ స్కెచ్ ఇదేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RC17: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కనున్న ‘RC17’పై అంచనాలు భారీగా ఉన్నాయి. 2018లో వచ్చిన ‘రంగస్థలం’తో ఇండస్ట్రీ హిట్ అందుకున్న ఈ కాంబో మరోసారి చేతులు కలపడంతో.. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. పుష్పా సక్సెస్‌తో సుకుమార్ క్రేజ్ నెక్ట్స్ లెవల్‌కి వెళ్లడం, పెద్దితో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌తో ఆయన సినిమా చేస్తుండటంతో ఈ కాంబినేషన్‌పై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ మంచి బజ్ ఉంది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై సోషల్ మీడియాలో పలువురు స్టార్ హీరోయిన్స్ పేర్లు జోరుగా ప్రచారం అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ ఆసక్తికరమైన పేరు తెరపైకి వచ్చింది. ‘ధురంధర్’ సినిమాతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన సారా అర్జున్.. ‘RC17’లో హీరోయిన్గా కనిపించనున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలో ఈ సినిమాలో కియారా అద్వానీ నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఇద్దరు హీరోయిన్లు ఉండొచ్చనే ప్రచారం కూడా జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం సారా అర్జున్ను ఈ ప్రాజెక్ట్‌లో లీడ్ హీరోయిన్గా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఒకవేళ ఇదే నిజమైతే రామ్ చరణ్, సారా అర్జున్ కాంబినేషన్ తెరపై ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొంది. అలాగే ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర కోసం లేడీ సూపర్ స్టార్ నయనతారను మేకర్స్ సంప్రదించినట్లు కూడా వార్తలు వచ్చాయి. దీనిపై కూడా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సుకుమార్ ఇప్పటికే ‘RC17’ స్క్రిప్ట్‌ను పూర్తి చేసినట్లు సమాచారం. ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో సినిమాను గ్రాండ్‌గా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ తన చేతి సర్జరీ నుంచి పూర్తిగా కోలుకుని ఫిట్నెస్ సాధించిన తర్వాత నవంబర్ 2026 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించే అవకాశాలున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ‘RC17’ను రెండు భాగాలుగా కాకుండా సింగిల్ పార్ట్‌గానే తెరకెక్కించనున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని 2027 చివర్లో లేదా 2028 సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ‘రంగస్థలం’ తర్వాత రామ్ చరణ్, సుకుమార్ మరోసారి కలిసి పనిచేస్తుండటంతో.. ‘RC17’పై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.
Also Read
- Nani: నా కెరీర్లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదే.. జడల బరువుపై నాని సంచలన వ్యాఖ్యలు!
- Nani: మా డైరెక్టర్ ఎవరినీ కొట్టలేదు.. నాని కీలక వ్యాఖ్యలు
- The Paradise: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి నాని ‘ది ప్యారడైజ్’!
- Hanuman Ansh: త్రివిక్రమ్ చేతుల మీదుగా తెలుగులోకి 'హనుమాన్ అంశ్' - సెప్టెంబర్ 18న గ్రాండ్ రిలీజ్!
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?