శ్రీనివాస్ ఉలిశెట్టి, సత్య ఈషా జంటగా నటించిన సినిమా ‘రాయుడి గారి తాలుకా’. ఉలిశెట్టి మూవీస్ బ్యానర్‌పై కొర్రపాటి నవీన్ శ్రీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఉలిశెట్టి మూవీస్ బ్యానర్‌పై ఉలిశెట్టి నిత్యశ్రీ, ఉలిశెట్టి పునర్వికా వేద శ్రీ,, నవీన్ శ్రీ కొర్రపాటి, పీజే దేవి, కరణం పేరినాయుడు నిర్మించారు. సుమన్ , కిట్టయ్య, R.K నాయుడు , సలార్ పూజ , కరణం శ్రీహరి, ఉలిశెట్టి నాగరాజు ,సృజనక్షిత, తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించగా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ని ప్రముఖ నటుడు సుమన్ విడుదల చేస్తూ సినిమా టీంకి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా హీరో శ్రీనివాస్ ఉలిశెట్టి మాట్లాడుతూ.. ‘ఓ డిఫరెంట్ కంటెంట్‌తో ఈ సినిమాను తెరకెక్కించాం, నటీనటులు అంతా కొత్తవారే అయినా చాలా బాగా నటించారు. కంటెంట్ ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు కాబట్టి మంచి కంటెంట్‌లో రాబోతున్న మా చిత్రాన్ని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాం. త్వరలోనే విడుదల తేదిని ప్రకటిస్తాం” అని అన్నారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లేని శ్రీనివాస్ ఉలిశెట్టి అందించగా నగేశ్ గౌరీష్ సంగీతం సమకూర్చాడు. గౌతమ్ వాయిలాడ సిమాటోగ్రాఫర్‌గా, ఎంజే సూర్య ఎడిటర్‌గా వ్యవహరించారు.