Maruthi Nagar Subramanyam: హీరోగా రావు రమేష్.. మారుతి నగర్ సుబ్రహ్మణ్యం’ఫస్ట్ లుక్ విడుదల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రావు రమేష్… తెలుగు ప్రేక్షకులు మెచ్చిన నటుడు. తండ్రి రావు గోపాలరావుకు తగ్గ తనయుడు అనిపించుకున్న నటుడు. అగ్ర హీరోలు సైతం అతనితో నటించాలని కోరుకునే ప్రతిభావంతుడు. వైవిధ్యమైన పాత్రలు, విలక్షణ నటనతో ప్రేక్షకుల్ని అలరించిన రావు రమేష్… ఇప్పుడు కథానాయకుడిగా ‘మారుతి నగర్ సుబ్రహ్మణ్యం’ సినిమా చేశారు.రావు రమేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘మారుతి నగర్ సుబ్రహ్మణ్యం’. ఆయన సరసన ఇంద్రజ నటించారు. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై రూపొందుతోంది. లక్ష్మణ్ కార్య ఈ చిత్రానికి దర్శకుడు. బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మాతలు. ఈ రోజు ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నారు. ప్రేక్షకులే ముఖ్య అతిథులుగా వినూత్నంగా ఫస్ట్ లుక్ విడుదల ప్లాన్ చేశారు.
Also Read; T20 World Cup 2024: సీఏపై ఒత్తిడి తెస్తున్న కోచ్.. ఆస్ట్రేలియాకు కొత్త కెప్టెన్!
Also Read
‘మారుతి నగర్ సుబ్రహ్మణ్యం’ ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా రావు రమేష్ ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియో చివర్లో ఆ క్యూఆర్ ఇచ్చారు. అది స్కాన్ చేస్తే ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుంది.
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లోని విజయవాడ మావయ్య, పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ‘కెజియఫ్’లో రాఘవన్ క్యారెక్టర్లు ఎంత పాపులర్ అనేది ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ఇద్దరూ రావు రమేష్ ముందు ప్రత్యక్షం అయ్యారు. ‘ఎప్పుడూ సగం సగం ఎంటర్‌టైన్ చేయడమేనా? ఫుల్లుగా మమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడం ఉందా? లేదా? అని! క్యారెక్టర్లు, సినిమా చేస్తున్నాం అంటే సరిపోయిందా? ప్రేక్షకులకు చక్కగా ఫుల్ మీల్స్ పెట్టినట్లు ఫుల్లుగా ఎంటర్‌టైన్ చేసి ఒక్కసారైనా పంపాలి కదా!’ అని విజయవాడ మావయ్య అడిగితే… ‘ఎస్! హి ఈజ్ రైట్. ఇది హాట్ ఇష్యూ, స్వీట్ ఇష్యూ, స్టేట్ ఇష్యూ! నువ్వు తప్పకుండా సమాధానం చెప్పాలి’ అని గట్టిగా అడి, . అప్పుడు రావు రమేష్ ”ఆన్సర్ చాలా సింపుల్. దేనికైనా అవకాశం రావాలి. ఇప్పుడు అవకాశం వచ్చింది. చేశాను. రిలీజ్ అవుతుంది’ అని చెప్పారు. సినిమా పేరేంటో? అని విజయవాడ మావయ్య అడిగితే… ‘మారుతి నగర్ సుబ్రహ్మణ్యం’ అని చెప్పారు. పేరు బావుందని విజయవాడ మావయ్య చెబితే… సినిమా ఇంకా బావుంటుందని రావు రమేష్ తెలిపారు.
సినిమా గురించి రావు రమేష్ మాట్లాడుతూ ”మారుతి నగర్ సుబ్రహ్మణ్యం… ఈ సినిమా భలే గమ్మత్తుగా ఉంటుంది. అయితే, ఈ సినిమా పోస్టర్ ఎవరు ఆవిష్కరిస్తే బావుంటుందని అనుకున్నా. నటుడిగా నాకు ఈ స్థాయిని, ఈ స్థానాన్ని ఇచ్చిన తెలుగు ప్రేక్షకులే ఆవిష్కరిస్తే బావుంటుందని మేమంతా మనస్ఫూర్తిగా నమ్మాం. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే… వీడియో చివర్లో వచ్చే క్యూఆర్ కోడ్ ని మీ చేతులతో స్కాన్ చేయండి. నా పోస్టర్ ఆవిష్కరించండి, ప్రోత్సహించండి” అని విజ్ఞప్తి చేశారు.
రావు రమేష్, ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్, అజయ్, అన్నపూర్ణమ్మ, ప్రవీణ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సాహిత్యం: ఆస్కార్ పురస్కార గ్రహీత చంద్రబోస్, భాస్కరభట్ల, కళ్యాణ్ చక్రవర్తి, ఆర్ట్ డైరెక్షన్: సురేష్ భీమంగని, ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి, పీఆర్వో: పులగం చిన్నారాయణ, సినిమాటోగ్రఫీ: ఎంఎన్ బాల్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్: శ్రీహరి ఉదయగిరి, సహ నిర్మాతలు: రుషి మర్ల, శివప్రసాద్ మర్ల, నిర్మాతలు: బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య, కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్: మోహన్ కార్య.
తాజావార్తలు
-
Mamata Banerjee: “జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!”.. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
Ranabaali Trailer: ‘రణబాలి’ ట్రైలర్‌పై మంత్రి లోకేష్ రివ్యూ!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!