Ravi Teja : ఆగస్ట్‌ రేస్‌లో మాస్ మహారాజా.. సాలిడ్ హిట్ కొడతాడా?

Irumudi

Irumudi

మాస్ మహారాజా రవితేజ బాక్సాఫీస్ వద్ద సరైన సాలిడ్ కమ్‌బ్యాక్ కోసం గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ రస్టిక్ యాక్షన్ ఎమోషనల్ డ్రామా ఇరుముడి‘. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ పవర్‌ఫుల్ కమ్‌బ్యాక్ మూవీని భారీ స్థాయిలో ఆగస్ట్ 2026 లో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఆగస్ట్ నెలలో ఉండే లాంగ్ వీకెండ్స్, పండుగ సెలవులను క్యాష్ చేసుకునేలా రిలీజ్ డేట్‌ను లాక్ చేయాలని చూస్తున్నారు.

ఈ సినిమాలో రవితేజ మునుపెన్నడూ చూడని సరికొత్త లుక్‌లో అయ్యప్ప స్వామి భక్తుడిగా కనిపించబోతున్నాడు మాస్ మహారాజా. తండ్రీ కూతుళ్ల మధ్య సాగే సున్నితమైన ఎమోషన్స్, హై-వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్, మరియు దైవికమైన అంశాల చుట్టూ ఈ చిత్ర కథాంశం తిరగనుంది. రవితేజ సరసన తమిళ బ్యూటీ ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇందులో ఒక ప్రత్యేకమైన ఓల్డ్ ఏజ్ గెటప్‌లో రవితేజ కనిపించే సీన్స్ హైలెట్ గా నిలవనున్నాయి. అలాగే సూపర్ హిట్ భక్తి గీతం ‘విల్లాలి వీరుడు’ సాంగ్ రీమేక్ కూడా ఉండబోతోందని వస్తున్న వార్తలు సినిమాపై హైప్‌ను మరింత పెంచేస్తున్నాయి. మరి ఈ సరికొత్త రస్టిక్ యాక్షన్ అస్త్రంతో రవితేజ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో తన సాలిడ్ కమ్‌బ్యాక్‌ను ఎలా చాటుకుంటారో చూడాలి.