Ravi Teja : ఆగస్ట్ రేస్‌లో మాస్ మహారాజా.. సాలిడ్ హిట్ కొడతాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజా రవితేజ బాక్సాఫీస్ వద్ద సరైన సాలిడ్ కమ్‌బ్యాక్ కోసం గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ రస్టిక్ యాక్షన్ ఎమోషనల్ డ్రామా ‘ఇరుముడి‘. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ పవర్ఫుల్ కమ్‌బ్యాక్ మూవీని భారీ స్థాయిలో ఆగస్ట్ 2026 లో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఆగస్ట్ నెలలో ఉండే లాంగ్ వీకెండ్స్, పండుగ సెలవులను క్యాష్ చేసుకునేలా రిలీజ్ డేట్‌ను లాక్ చేయాలని చూస్తున్నారు.
ఈ సినిమాలో రవితేజ మునుపెన్నడూ చూడని సరికొత్త లుక్‌లో అయ్యప్ప స్వామి భక్తుడిగా కనిపించబోతున్నాడు మాస్ మహారాజా. తండ్రీ కూతుళ్ల మధ్య సాగే సున్నితమైన ఎమోషన్స్, హై-వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్, మరియు దైవికమైన అంశాల చుట్టూ ఈ చిత్ర కథాంశం తిరగనుంది. రవితేజ సరసన తమిళ బ్యూటీ ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తుండగా జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇందులో ఒక ప్రత్యేకమైన ఓల్డ్ ఏజ్ గెటప్‌లో రవితేజ కనిపించే సీన్స్ హైలెట్ గా నిలవనున్నాయి. అలాగే సూపర్ హిట్ భక్తి గీతం ‘విల్లాలి వీరుడు’ సాంగ్ రీమేక్ కూడా ఉండబోతోందని వస్తున్న వార్తలు సినిమాపై హైప్‌ను మరింత పెంచేస్తున్నాయి. మరి ఈ సరికొత్త రస్టిక్ యాక్షన్ అస్త్రంతో రవితేజ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో తన సాలిడ్ కమ్‌బ్యాక్‌ను ఎలా చాటుకుంటారో చూడాలి.
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
తాజావార్తలు
-
Flydubai Attack: విమానాన్ని కూల్చాలనుకున్న ఒమన్ పైలట్.. ఇజ్రాయిల్‌కు అప్పగింతపై ట్విస్ట్!
-
Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
-
CURE Act: రేపటి నుంచే CURE యాక్ట్.. హైదరాబాద్ పాలనలో బిగ్ ఛేంజ్
-
Nepal: నేపాల్‌లో మరో ఘోరం.. హిమపాతం కూలి 15 మంది మృతి
-
Cheque Power : పంచాయతీల్లో చెక్ పవర్‌పై కీలక నిర్ణయం… 7 రోజులు దాటితే యాక్షన్
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?