Site icon NTV Telugu

ART CINEMASS: రవితేజ ART మాల్.. ఓపెనింగ్ ఆ సినిమాతోనే

Art

Art

స్టారో హీరోలందరూ ఒక్క్కొకరుగా థియేటర్స్ బిజినెస్ లో అడుగుపెడుతున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేశ్ బాబు కొండాపూర్ లో ఏషియన్ సునీల్ తో కలిసి AMB మాల్ లో బాగస్వామ్యులుగా ఉన్నారు. ఆడియన్స్ బెస్ట్ స్క్రీనింగ్ ఫెసిలిటి అందిస్తున్నారు. ఈ థియేటర్స్ కు సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇక మరొక టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అమీర్ పేట్ లోని ఏషియన్ సత్యంసినిమాస్ లో బాగస్వామ్యులుగా ఉన్నారు.  ట్రైలర్ లాంఛ్ కార్యక్రమాలకు ప్రీమియర్ షోస్ కు కేరాఫ్ గా మారింది AAA మాల్. అదే జోష్ లో ఇప్పడు వైజాగ్ లోను ఏషియన్ సునీల్ తో కలిసి పెట్టుబడులు పెడుతున్నారు.

Also Read : Pawan Kalyan : పవర్ స్టార్ స్పీడ్ అంటే ఇలానే ఉంటుంది మరి

ఇక ఇప్పుడు మరొక స్టార్ హీరో థియేటర్స్ వ్యాపారంలో అడుగుపెట్టారు. మాస్ మహారాజ్ రవితేజ హైదారాబాద్ లోని వనస్థలి పురంలో ఏషియన్ సునీల్ తో కలిసి ART మాల్ ను నిర్మించారు. మొత్తం ఆరు స్క్రీన్స్ తో భారీ ముల్టీప్లెక్స్ ను నిర్మించారు. ఇందులో ఒకటి ఎపిక్ లార్జ్ స్క్రీన్, మరో మూడు బిగ్ స్క్రీన్స్ తో పాటు రెండు స్మాల్ స్క్రీన్స్ తో అధునాతమైన సౌండ్ సిస్టమ్ తో తీసుకువస్తున్నట్టు తెలుస్తోంది. నిర్మాణ పనులు ముగించుకున్న ART సినిమాస్ ఈ నెల 31న విజయ్ దేవరకొండ కింగ్డమ్ తో ప్రారంభం కాబోతుంది. ఇలా స్టార్ హీరోలందరు ముల్టీప్లెక్స్ థియేటర్స్ వ్యాపారాలలో పెట్టుబడులు పెడుతున్నారు. అయితే అందరు ఏషియన్ సునీల్ తోనే భాగస్వామ్యంగా ఈ వ్యాపారంలోకి అడుగుపెడుతుండడం కొసమెరుపు. సినిమా లవర్స్ కు ప్రసాద్స్, ఎఎంబీ, AAA తో పాటు ఇప్పుడు ART కూడా బెస్ట్ సినిమాటిక్ అనుభూతిని ఇచ్చేందుకు రెడీ అవుతోంది.

Exit mobile version