Site icon NTV Telugu

Mass Maharaja : రవితేజ.. శివ నిర్వాణ.. మైత్రి మూవీస్

Raviteja

Raviteja

మాస్ మహారాజ రవితేజ బ్యాక్ బ్యాక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ప్రస్తుతం డెబ్యూ డైరెక్టర్ భాను భోగరవరపు దర్శకత్వంలో మాస్ జాతర చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. వారం రోజలు షూట్ తో పాటు కొంత ప్యాచ్ వర్క్ పెండింగ్ ఉంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే కిశోర్ తిరుమల దర్శకత్వంలో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాడు. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇటీవల షూటింగ్ ను కూడా స్టార్ట్ చేశారు.

Also Read : Coolie : కూలీలో అమీర్ ఖాన్ రోల్ ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

ఈ రెండు సినిమాల తర్వాత మ్యాడ్ స్క్వేర్ దర్శకుడుతో సినిమా చేయాల్సిఉంది. ఇదిలా ఉండగా ఇప్పుడు మరో సినిమాకు మాస్ మహారాజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాలివుడ్ సిర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తోంది. నిన్నుకోరి, మజిలి వంటి సూపర్ హిట్స్ అందించిన డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ సినిమా చేయబోతున్నాడట. ఇటీవల రవితేజను కలిసి థ్రిలర్ జానర్ లో ఓ కథ వినిపించగ పాయింట్ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.ఈ సినిమాను మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించబోతుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబందించి అధికారక ప్రకటన రాబోతుంది. హిట్టు ప్లాపులకు సంబంధం లేకుండా మాస్ మహారాజ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఇక విజయ్ దేవరకొండతో చేసిన ఖుషి ప్లాప్ తో శివనిర్వాణ మరో సినిమా చేయలేదు. లాంగ్ గ్యాప్ తర్వాత మరో పవర్ఫుల్ సబ్జెట్ తో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని పట్టుదలగా ఉన్నాడు శివ. అటు రవితేజ కూడా ధమాకా తర్వాత హిట్ చూడలేదు. ఈ ఇద్దరి కాంబోలో రాబోయే ఈ సినిమా ఎలా ఉండబోతుందో.

Exit mobile version