Coolie : కూలీలో అమీర్ ఖాన్ రోల్ ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. ఎందుకంటే… రజినీకాంత్ హీరోగా వచ్చిన కూలీ సినిమాలో అమీర్ ఖాన్ చేసిన దహా క్యారెక్టర్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు.ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏమిటంటే ఈ పాత్ర కోసం మొదటగా అప్రోచ్ అయినది బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ ను. అవును స్క్రిప్ట్ కూడా విన్నాట్ట.. కాని, షారూక్ కొన్ని కారణాల వల్ల ప్రాజెక్ట్‌ను వదిలేశాడు. తర్వాత లోకేష్ కనగరాజ్ నేరుగా ఆమిర్‌ను కలిశాడు.
Also Read : Tollywood Bundh : షూటింగ్స్ బంద్ ఎఫెక్ట్.. స్టార్ హీరో సినిమా రిలీజ్ వాయిదా
Also Read
‘రజినీ గారితో ఓ ఫ్రేమ్‌లో కనిపించే అవకాశమిది, రోల్ చిన్నదే కానీ ఇంపాక్ట్ చాలా పెద్దది!’ అని ఫీలైన ఆమిర్ వెంటనే అంగీకరించాడు. ఇంకా రజినీకాంత్‌పై ఉన్న గౌరవం, లోకేష్‌పై నమ్మకంతో ఈ రోల్ కోసం ఆమిర్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. ఎప్పుడూ బాలీవుడ్ ఈవెంట్స్‌లో కనిపించని ఆమిర్ ఖాన్ ఈసారి సౌత్‌లోనూ రజినీ కూలీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చి సినీ లవర్స్ ను థ్రిల్ చేశాడు. 5 నిమిషాల స్పీచ్‌తో అభిమానుల గుండెల్లో చోటు సంపాదించాడు. ఆయన మాటల్లో ఉన్న సింప్లిసిటీ, రజినీపై ఉన్న గౌరవం బయట పెట్టేశాడు. ‘నేను ఈ రకమైన ఈవెంట్స్‌కు ఎప్పుడు రాలేదు, కానీ రజినీ పిలిచినప్పుడు నిరాకరించలేకపోయాను. ఈ సినిమా నాకు ప్రత్యేకమైన అనుభవం ఎందుకంటే నేను కూడా ఫ్యాన్‌గా రజినీతో ఓ ఫ్రేమ్‌లో ఉన్నాను. అమీర్ స్పీచ్ కు సోషల్ మీడియాలో సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ‘బాలీవుడ్ పర్ఫెక్షనిస్ట్ సౌత్ ఫ్యాన్స్ మనసులు గెలిచాడు. ఇక అమీర్ ఖాన్ నెక్ట్స్ సినిమాలకు సౌత్ లో గ్రాండ్ వెల్కమ్ రావడం ఖాయం అనే చెప్పొచ్చు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!