Mokshada: మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘ఇరుముడి’. ప్రస్తుతం ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటూ సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. ఇరుముడి పాజిటివ్ టాక్‌తో సినిమా దూసుకెళ్తున్న నేపథ్యంలో.. ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు కూడా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ‘ఇరుముడి’లో రవితేజ కుమార్తె మోక్షద భూపతిరాజు పోషించిన కీలక పాత్ర ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినీ వర్గాల సమాచారం ప్రకారం.. మోక్షద ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించినట్లు సమాచారం. అయితే ఆమె బాధ్యతలు కేవలం ఆ పాత్రకే పరిమితం కాలేదని టాక్. ప్రాజెక్ట్‌ను ప్రారంభించడం నుంచి నిర్మాణ వ్యవహారాలను దగ్గరగా పర్యవేక్షించడం వరకు ఆమె కీలకంగా వ్యవహరించినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ‘ఇరుముడి’ కథను రవితేజ ఓకే చేయడంలోనూ మోక్షద పాత్ర ఉందని సమాచారం.
తండ్రి రవితేజ నుంచి సినిమా నిర్మాణానికి సంబంధించిన విషయాలను నేర్చుకుంటున్న మోక్షద.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే రవితేజ ప్రాజెక్టుల నిర్మాణ వ్యవహారాల్లోనూ ఆమె కీలకంగా భాగస్వామి కానున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ‘ఇరుముడి’ విడుదల తర్వాత మోక్షద పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా విజయానికి ఆమె చేసిన కృషికి తగిన క్రెడిట్ ఇవ్వాలంటూ పలువురు నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. ఇదే సమయంలో రవితేజ కుమారుడు మహాధన్ సెన్సెషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దగ్గర స్పిరిట్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.

