Mythri Ravi: “రూ. 2 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లా? మాకు ఇది చెంపపెట్టు”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mythri Ravi: “మేము వందల కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు తీస్తుంటే లెక్కలు కుదరడం లేదు.. కానీ కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం ఏకంగా రూ. 400 కోట్ల గ్రాస్ కొల్లగొట్టడం సినిమా పరిశ్రమకే ఒక పెద్ద చెంపపెట్టులాంటిది” అంటూ ప్రముఖ నిర్మాత వై.రవిశంకర్ (మైత్రీ మూవీ మేకర్స్) సంచలన కామెంట్స్ చేశారు. నీమ్ కరోలీ బాబా జీవిత కథ ఆధారంగా రూపొంది, దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్ ప్రెస్మీట్లో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ.. “హనుమంతుడి ప్రస్తావన ఉన్న ప్రతి సినిమాను ఆ దేవుడే ముందుకు నడిపిస్తున్నాడేమో అనిపిస్తోంది. గతంలో ‘హను-మాన్’ సినిమా అలాగే ఆడింది, ఇప్పుడు రాజమౌళి గారి ప్రాజెక్ట్ ట్రైలర్లోనూ చూశాం. కానీ ‘హనుమాన్ అంశ్’ చేసిన మ్యాజిక్ సాధారణమైనది కాదు. చిన్న బడ్జెట్‌తో వచ్చి ఇంతటి సంచలనం సృష్టించిన ఈ సినిమానే నిజమైన పాన్-ఇండియా మూవీ. ఏయే భాషల్లో ఇంకా మిగిలి ఉందో వాటన్నింటిలోనూ వెంటనే రిలీజ్ చేయాలి. హోంబలే ఫిలిమ్స్ లాంటి ప్రఖ్యాత సంస్థ సరైన ప్రాజెక్ట్‌ను పట్టుకుంది, నైజాంలో దీనిని డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశం మాకు రావడం ఎంతో ఆనందంగా ఉంది” అని పేర్కొన్నారు.
నేటి సమాజంలో ఇలాంటి భక్తిరస చిత్రాల అవసరం ఎంతైనా ఉందని రవిశంకర్ అభిప్రాయపడ్డారు. “ప్రస్తుతం సోషల్ మీడియా అంతా బురదజల్లుకోవడం, ట్రోలింగ్స్, ఏఐ (AI) మాయతో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని తీవ్ర కాలుష్యంతో నిండిపోయింది. ముఖ్యంగా నేటి యువత ఈ ట్రాప్‌లో పడిపోతున్నారు. అలాంటి వారికి మనశ్శాంతిని ఇవ్వడానికి, దేవుడంటే భయం, భక్తిని పెంపొందించడానికి ఇలాంటి దివ్యత్వంతో కూడిన సినిమాలు ఎంతో అవసరం. స్టీవ్ జాబ్స్ లాంటి ప్రపంచ దిగ్గజాలు సైతం దర్శించుకున్న గొప్ప దైవస్వరూపం నీమ్ కరోలీ బాబా కథ ఇది. దసరా సెలవుల్లో తల్లిదండ్రులు తప్పకుండా తమ పిల్లలకు ఈ సినిమాను చూపించాలి” అని పిలుపునిచ్చారు. నటుడు శోభినవ్ సత్య నటన, దర్శకుడు విశాల్ చతుర్వేది టేకింగ్‌ను కొనియాడిన ఆయన, అక్టోబర్ 9న థియేటర్లలో రిలీజ్ అవుతున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకుల ఆదరణను కూడా గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
Also Read
- Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
- Sidharth - Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
- Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
- Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని 'రణబాలి'తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
తాజావార్తలు
-
Mythri Ravi: “రూ. 2 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లా? మాకు ఇది చెంపపెట్టు”
-
Pre-Launch Scam: తెల్లాపూర్‌లో తక్కువ ధరకే ఫ్లాట్లు అని ఎర.. నిలువునా ముంచిన బిల్డర్
-
Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
-
Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
-
Sidharth – Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!