Rashmika: రష్మికకి టైట్ సెక్యూరిటీ?
- రష్మికకి టైట్ సెక్యూరిటీ
- సల్మాన్ ఖాన్ సినిమాలో హీరోయిన్ గా రష్మిక
- రష్మికకు అదనపు సెక్యూరిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ క్షమాపణలు చెప్పాలని బిష్ణోయ్ వర్గీయులు డిమాండ్ చేయడంతో ఆయన సెక్యూరిటీ ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి తీవ్రమైన బెదిరింపులు వస్తున్నాయి. అయితే కొన్నాళ్ళు బ్రేక్ తీసుకున్న సల్మాన్ ఖాన్ సినిమా షూటింగ్లు తిరిగి మొదలుపెట్టారు. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం “సికందర్” సినిమా చేస్తున్నాడు. దర్శకుడు AR మురుగదాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె మొదటి సారి సల్మాన్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇక సల్మాన్ ఖాన్ షూట్ కి రావడంతో ఈ సినిమా సెట్ల చుట్టూ భద్రత పెంచాలని టీమ్ నిర్ణయించుకున్నారు. సల్మాన్ ఖాన్ ఇప్పటికే తన భద్రతా సిబ్బందిని పెంచుకున్నాడు.
Actor Bala: కోట్ల ఆస్తి కోసం 4వ పెళ్లి చేసుకున్న నటుడు
Also Read
దానికి తోడు అత్యాధునిక భద్రతా ఫీచర్లతో కొత్త కారును కొనుగోలు చేశాడు. ఇక మరోపక్క హీరోయిన్ రష్మిక మందన్నతో సహా అందరు స్టార్ నటీనటులను కూడా సల్మాన్ ఖాన్ శత్రువుల నుంచి రక్షించడానికి “సికందర్” టీమ్ అదనపు సెక్యూరిటీని మోహరించాలని యోచిస్తున్నట్లు ఊహాగానాలు ఉన్నాయి. సల్మాన్ చివరి చిత్రం ‘టైగర్ 3’ గత సంవత్సరం దీపావళి సందర్భంగా విడుదలైంది. కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆ తర్వాత సల్మాన్ పెద్దగా బిగ్ స్క్రీన్ మీద కనిపించడం లేదు. ఈ సినిమాలో సునీల్ శెట్టి, కాజల్ అగర్వాల్, శర్మన్ జోషి, అంజినీ ధావన్, ప్రతీక్ బబ్బర్ అలాగే సత్యరాజ్ కూడా ‘సికిందర్’లో కనిపించనున్నారు. ఈ చిత్రం 2025లో ఈద్ సందర్భంగా మార్చి 31న విడుదల కానుంది.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..