Site icon NTV Telugu

Rashmika : రష్మిక మందన్న బర్త్ డే సెలబ్రేషన్స్.. ఎవరెవరు అటెండ్ అయ్యారు?

Rashmika (6)

Rashmika (6)

ప్రజంట్ వరుస విజయాలతో దూసుకుపోతోంది కన్నడ భామ రష్మిక. ‘పుష్ప’ ఫ్రాంఛైజీ, యానిమల్‌, ‘ఛావా’ ఈ మూడు చిత్రాలు ఆమెకు దేశవ్యాప్తంగా తిరుగులేని పాపులారిటీని తెచ్చిపెట్టాయి. ఓ దక్షిణాది కథానాయిక అనతికాలంలోనే ఈ స్థాయి పేరుప్రఖ్యాతులు దక్కించుకోవడం అరుదైన విషయం. ఇక రీసెంట్ గా బాలీవుడ్‌లో ‘సికంర్’ మూవీతో రాగా.. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘గర్ల్‌ఫ్రెండ్’, ధనుష్ తో కలిసి ‘కుబేర’, ‘తమా’ అనే హిందీ సినిమాలో రష్మిక లీడ్ రోల్ పోషిస్తోంది. అలాగే లేడీ ఓరియెంట్ మూవీ ‘రెయిన్‌బో’ లోనూ యాక్ట్ చేస్తోంది. వీటన్నిటితో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు రష్మిక చేతిలో ఉన్నాయి. ఇదిలా ఉంటే..

Also Read: Hebah Patel : నేను ఎక్కువగా జైల్ లోనే ఉంటాను..

తాజాగా నిన్న శుక్రవారం (ఏప్రిల్ 05) రష్మిక పుట్టిన రోజు. దీంతో ఈ స్పెషల్‌డే కోసం ఆమె సినిమా షూటింగుల నుంచి కాస్త బ్రేక్ తీసుకొని విదేశాలకు వెళ్లింది. బిజీ షూటింగ్‌ షెడ్యూల్స్‌ నుంచి బ్రేక్‌ తీసుకున్న రష్మిక మందన్న ఇప్పటికే తన కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి ఓమన్‌ దేశం కు చేరుకుంది. ఫ్యామిలీ మెంబర్స్‌, కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో రష్మిక బర్త్‌డే సెలబ్రేట్‌ చేసుకోనుందని సమాచారం. ప్రజంట్ ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు రివిల్ అవ్వగా అందులో రష్మిక మాత్రమే కనిపించింది. ఇంక ఎవ్వరెవ్వరు వెళ్లారు అనేది తెలియాల్సి ఉంది.

Exit mobile version