Site icon NTV Telugu

Rashmika : వృత్తి కోసం వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేశా..

Rashmika

Rashmika

పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన నటి రష్మిక మందన్న ప్రస్తుతం తన కెరీర్‌లో సూపర్ పీక్ లో ఉంది. భాషా భేదం లేకుండా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ పరిశ్రమల్లో వరుసగా పెద్ద సినిమాల్లో నటిస్తూ విజయాలు అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత బాధను పంచుకుం‌ది. మీరు సెలవులు ఎలా ఎంజాయ్ చేస్తారు? అనే ప్రశ్నకు రష్మిక చాలా భావోద్వేగంగా స్పందించారు.

Also Read :Vijay Sethupathi: సూర్య కారణంగా.. క్షమాపణలు చెప్పిన విజయ్ సేతుపతి

రష్మిక మాట్లాడుతూ.. ‘ నాకు ఒక చెల్లి ఉంది. ఆమె నాకంటే 16 ఏళ్లు చిన్నది. ఇప్పుడామెకు 13 ఏళ్లు. తనతో ఆడుకునేందుకు, అప్పట్లో వారాంతపు సెలవు కోసం ఏడ్చేదాని.  కానీ ఇప్పుడు నా కెరీర్ ప్రారంభమైనప్పటి నుంచి, గత ఎనిమిదేళ్లుగా ఆమెతో సరైన సమయం గడిపే అవకాశం దక్కడంలేదు. అదే నన్ను ఎక్కువగా బాధిస్తుంది. గత ఏడాదిన్నరగా నేను ఇంటికి వెళ్లలేదు. స్నేహితుల్ని కలవలేదు. వాళ్లు ఏదైనా ప్లాన్ చేస్తే ముందు నన్ను అడిగేవారు. కానీ ఇప్పుడు, నాకు సమయం ఉండద‌ని వాళ్లే డిసైడ్ అవుతున్నారు. నాన్నమ్మ ఎప్పుడూ చెబుతుండేది. వృత్తి‌లో రాణించాలంటే వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేయాల్సిందే. రెండింటికీ సమతుల్యత అవసరం. అందుకే నేను రెండింటిని బ్యాలెన్స్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాను. అందుకే నా స్వగ్రామాన్ని మిస్ అవుతున్నాను’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు రష్మిక.

స్టార్ డమ్ వెనుక ఉన్న బాధ, ఒత్తిడి, త్యాగం ఈ ఇంటర్వ్యూలో స్పష్టమవుతోంది. కెరీర్‌లో వెలుగు చూసే నటీమణులు ఎలాంటి మానసిక, భావోద్వేగ అడ్డంకులు దాటుకుంటున్నారో అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఇక ఇటీవల విడుదలైన ‘కుబేర’ తో మరో హిట్ ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రజంట్ ‘ధామా’, ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’,‘మైసా’ లాంటీ చిత్రాలతో బిజీగా ఉన్నారు.

Exit mobile version