టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా, దేశవ్యాప్తంగా తన అందం, అభినయం, ఎనర్జీతో మెప్పిస్తున్న నటి రష్మిక మందన్న. ప్రజంట్ వరుస భారీ చిత్రాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా తన సినీ ప్రయాణం గురించి ఓ కార్యక్రమంలో స్పందించారు. ఆమె మాటలు యువతికి ప్రేరణగా నిలిచేలా ఉన్నాయి.
Also Read : SSMB29 : ఓటీటీ పోటీ స్టార్ట్ అయింది.. లైన్‌లో ఉన్న ప్లాట్‌ఫామ్స్ ఇవే..!
‘ఈ కాలంలో అందరూ సినిమాల్లోకి రావాలని ఆశపడతారు. కానీ మేము మొదలెట్టినప్పుడు పరిస్థితి చాలా వేరుగా ఉండేది. దక్షిణాది కుటుంబాల్లో సినీరంగం అంటే నిషేధంగా భావించేవారు. నటిగా మారటం, కెరీర్‌ను నిర్మించటం అనేవి సులభమైన విషయాలు కావు. నటిగా మారాలనే ఆలోచన లేదు. మా నాన్న గారు మమ్మల్ని వ్యాపారంలోకి తీసుకురావాలనుకున్నారు. కానీ నేనిప్పుడు చూస్తుంటే ఆ రోజు తీసుకున్న ఆత్మవిశ్వాసపూరిత నిర్ణయమే నన్ను ఇక్కడికి తీసుకు వచ్చింది. ప్రతి ఎదురు దెబ్బ అవకాశంగా మలచుకున్నాను. ప్రతి విజయం నాకు కొత్త విద్యను నేర్పింది. ఇప్పుడు నేను హీరోయిన్‌గా కాకుండా, వ్యక్తిగా ఎదిగాను ఎదిగాను. అదే నాకు నిజమైన గర్వకారణం. ఈ రంగాల్లో పురుషులతో పాటు మహిళలు కూడా ఎదుగుతున్నారు. విజయాన్ని సాదించడమే కాదు, ఆ విజయాన్ని నిలబెట్టుకోవడమే అసలైన సవాల్. నటీమణులు ఈ విషయంలో ఎంతో శ్రమిస్తున్నారు. ఒక నటి పాత్రలతో పాటు సమాజపు అంచనాలను, విమర్శల్ని ఎదుర్కొంటుంది. కానీ అదే ఆమె నిజమైన బలం. ఇవన్నీ ఒక నటిగా కాదు… ఒక మహిళగా, ఒక వ్యక్తిగా మాట్లాడుతున్న మాటలు. ఒక నటి పాత్రలు మాత్రమే కాదు.. సమాజం అంచనాలను, విమర్శల్ని అధిగమించాలి. అదే నిజమైన బలం. ప్రతి మహిళా నటికి అదే అసలైన విజయం’ అని తెలిపింది.
