Rashmika : రష్మిక సోలో స్టార్ ఇమేజ్ తెచ్చుకుంటుందా?

Rashmika Mandanna

Rashmika Mandanna

వరుసగా పాన్ ఇండియా సినిమాలు… స్టార్ హీరోలతో క్రేజీ కాంబినేషన్స్… రష్మిక కెరీర్ ఫుల్ బిజీగా ఉంది. ఒక సినిమాలో తన షూట్ కంప్లీట్ కావడంతో తన యాక్టింగ్ పై ప్రశంసలు కురిపించారు చిత్ర యూనిట్. అయితే ‘మైసా’తో రష్మిక సోలో స్టార్ ఇమేజ్ ను తెచ్చుకుంటుందా? లేక స్టార్ హీరోల సినిమాల్లో హిట్ అయిన హీరోయిన్ గానే మిగిలిపోతుందా? విజయ్ దేవరకొండతో రష్మికకు ఉన్న కాంబినేషన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ ‘రణబాలి’లో మాత్రం జయమ్మ పాత్రతో ఈ జోడీ మరోసారి కొత్తగా కనిపించబోతుంది. ముఖ్యంగా రష్మిక బేబీ బంప్ తో కనిపించిన వీడియో ఇప్పుడు సినిమాపై ఆసక్తిని పెంచుతుంది.

స్పెషల్ గా కేర్ తీసుకొని రాసిన జయమ్మ పాత్ర గురించి ఎమోషనల్ పోస్ట్ చేశాడు రాహుల్ సాంకృత్యన్. ఇక రష్మిక పాత్రకు సంబంధించి ‘రణబాలి’ షూట్ పూర్తయింది. ప్రస్తుతం రష్మిక ఫోకస్ ‘మైసా’. అయితే ఆమె కెరీర్ లో ‘మైసా’ మరో కొత్త ప్రయోగం. ఇప్పటివరకు ఎక్కువగా గ్లామర్, లవ్, ఫ్యామిలీ క్యారెక్టర్స్ లో కనిపించిన రష్మిక ఇందులో మాస్ యాక్షన్ అవతార్ లో కనిపించనుంది. ముఖ్యంగా అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్ అవుతుందని టాక్. ఇక రష్మిక అప్ కమింగ్ లిస్ట్ చూస్తే వరుసగా పాన్ ఇండియా సినిమాలు, భారీ బడ్జెట్లు! కానీ స్టార్ హీరోల సినిమాలతో సక్సెస్ లో భాగం కావడం వేరు, తన పేరుతోనే ఓ సినిమాను సక్సెస్ చేయడం వేరు. మరి రష్మిక రెండో స్టెప్ ‘మైసా’తో నెరవేరుతుందో లేదో చూడాలి.