Site icon NTV Telugu

Rashmika: మీడియా ముందుకు రష్మిక.. పెదవి విప్పేనా?

Rashmika

Rashmika

యంగ్ హీరోయిన్ రష్మిక తెలుగుతో పాటు బాలీవుడ్ సినిమాల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ‘ధామ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె, ఇప్పుడు మరో పది రోజుల్లో ‘గర్ల్ ఫ్రెండ్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమాని రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేయగా, తెలుగులో నిర్మాత ధీరజ్ మొగిలినేని నిర్మించారు. లేడీ ఓరియంటెడ్ సబ్జెక్టుగా రూపొందించబడుతున్న ఈ సినిమాలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి కీలక పాత్రలో నటిస్తున్నాడు.

Also Read:The Girlfriend : రష్మిక మందన్న మ్యాజిక్‌కి నెట్‌ఫ్లిక్స్ భారీ చెక్ – ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ఫ్యాన్సీ డీల్

అయితే, ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే ఒక కామన్ ఇంటర్వ్యూ చేసి మీడియా ముందుకు వదిలారు. ఇక ఈరోజు ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని ఒక మల్టీప్లెక్స్‌లో జరగబోతోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ ప్రెస్ మీట్‌లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ కూడా ఉంది. కచ్చితంగా రష్మిక హాజరవుతుందని అంటున్నారు. కాబట్టి, ఆమెకు ఇటీవల ఆమె సీక్రెట్‌గా చేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతున్న ఎంగేజ్‌మెంట్ గురించి
ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉంది.

Also Read:SSMB29 : SSMB29 నుంచి సౌండ్‌ మొదలైంది – కాలభైరవ రివీల్ చేసిన ఆసక్తికర అప్‌డేట్!

ఈ నేపథ్యంలో, రష్మిక కేవలం సినిమాకి సంబంధించిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెబుతానని వాటిని దాటవేస్తుందా, లేక తన ఎంగేజ్‌మెంట్ గురించి పెదవి విప్పి మాట్లాడుతుందా అనే విషయం మీద చర్చ జరుగుతోంది. దాదాపుగా రష్మిక స్పందించకపోవచ్చు అని చర్చ ఎక్కువగా ఉంది. మరి ఈరోజు రష్మిక తన ఎంగేజ్‌మెంట్ గురించి మాట్లాడుతుందా లేదా అనేది వేచి చూడాలి.

Exit mobile version