Rashmika : ట్రీట్‌మెంట్ అయ్యింది అన్న రష్మిక.. కంగారులో ఫ్యాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ ప్రపంచం అంటే గ్లామర్, అందం, ప్రెజెంటేషన్ ఎంత ముఖ్యమో తెలిసిందే. ప్రేక్షకుల దృష్టిలో స్టార్ ఇమేజ్ అంటే కేవలం నటన కాదు లుక్, స్టైల్, ప్రెజెన్స్ కూడా చాలా కీలకం. ముఖ్యంగా హీరోయిన్‌లకు అయితే, బ్యూటీ మెయింటెనెన్స్ అనేది కెరీర్‌లో భాగమే. అందుకే వారు వ్యాయామం, యోగా, స్ట్రిక్ట్ డైట్‌లు, స్కిన్ కేర్, బ్యూటీ ట్రీట్‌మెంట్లు అన్నీ పాటిస్తూ ఉంటారు. తాజాగా ఈ జాబితాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కూడా చేరిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read : Dhanya Balakrishna : నా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ వల్లే సక్సెస్ కాలేదు – ధన్య బాలకృష్ణ
Also Read
- Salman Khan: స్కూల్ రోజుల్లోనే ఎగ్జామ్ పేపర్లు లీక్ చేసిన సల్మాన్ ఖాన్.. తండ్రి బయటపెట్టిన సంచలన నిజాలు!
- Vijayashanti: నటించాలని లేదు కానీ.. విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Jeetendra: 4 లక్షల పెట్టుబడితో 450 కోట్ల జాక్‌పాట్ కొట్టిన నటుడు... అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Land Grab Case: జూబ్లీహిల్స్‌లో భూ కబ్జా యత్నం.. ఇద్దరు ప్రముఖ సినీ నిర్మాతలపై కేసు నమోదు!
ఇటీవల రష్మిక ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. ఎప్పటిలాగే ఆమెను చూసిన అభిమానులు, ఫోటోగ్రాఫర్లు వెంటనే చుట్టుముట్టారు. బ్లాక్ డ్రెస్, బ్లాక్ మాస్క్‌తో సింపుల్‌గా ఉన్న రష్మికను చూసి “మాస్క్ తీయండి మేడమ్, ఒక ఫోటో ప్లీజ్!” అని ఫోటోగ్రాఫర్లు అడిగారు. అయితే ఈసారి రష్మిక మాత్రం మాస్క్ తీయకుండా నవ్వుతూ, “ఫేస్ ట్రీట్‌మెంట్ అయ్యింది గైస్, తీయలేను” అని చెప్పింది. ఆ ఒక్క మాట చాలు సోషల్ మీడియాలో హంగామా మొదలైంది. “రష్మిక ముఖానికి ఏమైంది?”, “ఏ ట్రీట్‌మెంట్ చేయించుకుందో?”, “లిప్ ఫిల్లర్ వేసుకుందేమో?” అంటూ నెటిజన్లు ఊహాగానాలు మొదలుపెట్టారు. కొంతమంది అభిమానులు ఆమె తాజా ఫోటోలు, వీడియోల్లో లుక్‌లో కొద్దిగా మార్పులు కనిపిస్తున్నాయని కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆమె లిప్స్ దగ్గర మార్పులు కనిపిస్తున్నాయంటూ చర్చ జరుగుతోంది. “లిప్ ఫిల్లర్స్ వేసుకుందేమో” అని కొందరు అంటుండగా, “స్కిన్ గ్లో ట్రీట్‌మెంట్ చేసుకుందేమో” అని మరికొందరు అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉండగా, కొంతమంది అభిమానులు మాత్రం రష్మికకు మద్దతుగా నిలుస్తున్నారు. “రష్మిక సహజంగా చాలా అందంగా ఉంటుంది, ఇలాంటి ట్రీట్‌మెంట్‌లు ఆమెకు అవసరమే లేదు”, “నేచురల్ లుక్‌నే ఆమె స్పెషల్!” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు మాత్రం ఆమె వ్యక్తిగత జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని “ఇటీవల రష్మిక–విజయ్ దేవరకొండ లవ్ రూమర్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. బహుశా పెళ్లికి ముందు కొత్త లుక్ కోసం ఇలా చేసుకుందేమో?” అంటూ ఊహాగానాలు పెడుతున్నారు.
తాజావార్తలు
-
Delhi: ఢిల్లీలో ఆంక్షలు తీవ్రం.. పోలీసులకు కేంద్ర హోంశాఖకు ప్రత్యేక అధికారాలు
-
Congress: ప్రధాని నివాసం కాదు, జంతర్ మంతర్ రావాల్సింది.. కాంగ్రెస్‌పై వాంగ్‌చుక్ భార్య విమర్శలు..
-
Salman Khan: స్కూల్ రోజుల్లోనే ఎగ్జామ్ పేపర్లు లీక్ చేసిన సల్మాన్ ఖాన్.. తండ్రి బయటపెట్టిన సంచలన నిజాలు!
-
Delhi: ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేతపై సుప్రీంకోర్టు సీరియస్.. సీజేఐ కీలక వ్యాఖ్యలు
-
US Defense Budget: ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికా డిఫెన్స్ బడ్జెట్.. షాక్‌కు గురి చేస్తున్న లక్షల కోట్లు!
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!