Site icon NTV Telugu

Rashmika : ట్రీట్‌మెంట్‌ అయ్యింది అన్న రష్మిక.. కంగారులో ఫ్యాన్స్

Rashmika

Rashmika

సినీ ప్రపంచం అంటే గ్లామర్‌, అందం, ప్రెజెంటేషన్‌ ఎంత ముఖ్యమో తెలిసిందే. ప్రేక్షకుల దృష్టిలో స్టార్‌ ఇమేజ్‌ అంటే కేవలం నటన కాదు లుక్‌, స్టైల్‌, ప్రెజెన్స్‌ కూడా చాలా కీలకం. ముఖ్యంగా హీరోయిన్‌లకు అయితే, బ్యూటీ మెయింటెనెన్స్‌ అనేది కెరీర్‌లో భాగమే. అందుకే వారు వ్యాయామం, యోగా, స్ట్రిక్ట్‌ డైట్‌లు, స్కిన్‌ కేర్‌, బ్యూటీ ట్రీట్‌మెంట్లు అన్నీ పాటిస్తూ ఉంటారు. తాజాగా ఈ జాబితాలో నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా కూడా చేరిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read : Dhanya Balakrishna : నా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌ వల్లే సక్సెస్‌ కాలేదు – ధన్య బాలకృష్ణ

ఇటీవల రష్మిక ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. ఎప్పటిలాగే ఆమెను చూసిన అభిమానులు, ఫోటోగ్రాఫర్లు వెంటనే చుట్టుముట్టారు. బ్లాక్‌ డ్రెస్‌, బ్లాక్‌ మాస్క్‌తో సింపుల్‌గా ఉన్న రష్మికను చూసి “మాస్క్‌ తీయండి మేడమ్‌, ఒక ఫోటో ప్లీజ్‌!” అని ఫోటోగ్రాఫర్లు అడిగారు. అయితే ఈసారి రష్మిక మాత్రం మాస్క్‌ తీయకుండా నవ్వుతూ, “ఫేస్‌ ట్రీట్‌మెంట్‌ అయ్యింది గైస్‌, తీయలేను” అని చెప్పింది. ఆ ఒక్క మాట చాలు సోషల్‌ మీడియాలో హంగామా మొదలైంది. “రష్మిక ముఖానికి ఏమైంది?”, “ఏ ట్రీట్‌మెంట్‌ చేయించుకుందో?”, “లిప్‌ ఫిల్లర్‌ వేసుకుందేమో?” అంటూ నెటిజన్లు ఊహాగానాలు మొదలుపెట్టారు. కొంతమంది అభిమానులు ఆమె తాజా ఫోటోలు, వీడియోల్లో లుక్‌లో కొద్దిగా మార్పులు కనిపిస్తున్నాయని కామెంట్‌ చేస్తున్నారు. ముఖ్యంగా ఆమె లిప్స్‌ దగ్గర మార్పులు కనిపిస్తున్నాయంటూ చర్చ జరుగుతోంది. “లిప్‌ ఫిల్లర్స్‌ వేసుకుందేమో” అని కొందరు అంటుండగా, “స్కిన్‌ గ్లో ట్రీట్‌మెంట్‌ చేసుకుందేమో” అని మరికొందరు అభిప్రాయపడ్డారు.

ఇదిలా ఉండగా, కొంతమంది అభిమానులు మాత్రం రష్మికకు మద్దతుగా నిలుస్తున్నారు. “రష్మిక సహజంగా చాలా అందంగా ఉంటుంది, ఇలాంటి ట్రీట్‌మెంట్‌లు ఆమెకు అవసరమే లేదు”, “నేచురల్‌ లుక్‌నే ఆమె స్పెషల్‌!” అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. మరి కొందరు మాత్రం ఆమె వ్యక్తిగత జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని “ఇటీవల రష్మిక–విజయ్ దేవరకొండ లవ్‌ రూమర్స్‌ ఎక్కువగా వినిపిస్తున్నాయి. బహుశా పెళ్లికి ముందు కొత్త లుక్‌ కోసం ఇలా చేసుకుందేమో?” అంటూ ఊహాగానాలు పెడుతున్నారు.

Exit mobile version