Site icon NTV Telugu

Rashmika Mandanna: ప్లాప్ వచ్చినా రష్మికను నార్త్ బెల్ట్ వదులుకోలేకపోతుందా..?

Rashmika Mandanna Acciden

Rashmika Mandanna Acciden

టాలీవుడ్ అండ్ బాలీవుడ్‌లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ ఎవరంటే.. ఠక్కున గుర్తొచ్చే పేరు రష్మిక. ముఖ్యంగా నార్త్ బెల్ట్‌లో యంగ్ హీరోలకు లేడీ లక్కుగా మారింది. వంద, రెండు వందల కోట్లు చూడటమే కష్టం అనుకునే హీరోలకు ఏకంగా 500 కోట్లు టేస్ట్ ఎలా ఉంటుందో చూపించిన బ్యూటీగా మారింది. యానిమల్, ఛావాతో రణబీర్, విక్కీ కౌశల్ కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రాల్లో హీరోయిన్‌గా ఇప్పటి వరకు తన పేరు లిఖించుకుంది శ్రీ వల్లి.

Also Read:Ranbir Kapoor: రణ్ బీర్ కపూర్ పై కేసు.. NHRC ఆదేశాలు

సికిందర్ ప్లాపైనా.. దర్శకుడు మురుగుదాస్‌పై మార్క్ పడిందే తప్ప.. రష్మికకు నెగిటివ్ మచ్చ అంటలేదు సరికదా.. ఆమెకు డిమాండ్ డబులయ్యింది. అందుకే ఆఫర్లను కట్టబెడుతోంది బీటౌన్. బ్లాక్ బస్టర్ కావాలా.. అంటే రష్ ఉండాలా అన్నట్లుగా మారిపోయింది అక్కడి తీరు. ప్రజెంట్ హిందీలో థమా చేస్తోంది బ్యూటీ. ఆయుష్మాన్ ఖురానాతో జోడీ కడుతోంది. ఇందులో వ్యాంపైర్‌గా కనిపించబోతుందట గీతాంజలి. అక్టోబర్ 21న రిలీజ్‌కు రెడీ అవుతోంది.

Also Read:They Call Him OG : ఏళ్ల తర్వాత మెగా హీరో సినిమాకి ‘A’ సర్టిఫికెట్.. ఇవే కట్స్

దేవాతో ప్లాప్ చూసిన షాహీద్ కపూర్ కూడా తన ఖాతాలో కూడా హయ్యెస్ట్ గ్రాసర్ ఫిల్మ్ ప్లాన్ చేసుకుంటున్నాడు. అందుకే ఒక్కరినీ కాదు తనకు కలిసొచ్చిన కృతి సనన్‌తో పాటు రష్మికను కూడా యాడ్ చేసుకున్నాడు. కాక్ టైల్ సీక్వెల్లో ఈ ఇద్దరు భామల్ని సెట్ చేశాడు. రీసెంట్లీ స్టార్టైన ఈ ఫిల్మ్ నెక్ట్స్ ఇయర్ సెకండాఫ్‌లో రిలీజయ్యే ఛాన్స్ ఉంది. రణబీర్, విక్కీలకు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన నేషనల్ క్రష్ ఆయుష్మాన్, షాహీద్‌లకు కూడా గట్టి బ్రేక్ ఇస్తుందేమో లెట్స్ వెయిట్. ఇక తెలుగులో గర్ల్ ఫ్రెండ్, మైసా ఫీమేల్ ఓరియెంట్ చిత్రాలతో పాటు విజయ్ దేవరకొండతో ఫిల్మ్ చేస్తుందని టాక్.

Exit mobile version