Rashmika Mandanna appointed as National Ambassador for Cyber Safety Initiatives: భారతదేశంలో సైబర్ నేరాలు నిరంతరం పెరుగుతున్నాయి. ఈ సైబర్ నేరాల వల్ల పెద్ద సంఖ్యలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సైబర్ క్రైమ్ చాలా కాలంగా భారత ప్రభుత్వానికి పెద్ద సమస్యగా ఉంది. ప్రజలను హెచ్చరిస్తూ ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉంది. అందులో భాగంగానే హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) సైబర్ భద్రతను ప్రోత్సహించే జాతీయ అంబాసిడర్‌గా నటి రష్మిక మందన్నను నియమించింది. సైబర్ బెదిరింపుల గురించి అవగాహన పెంచడం, ఆన్‌లైన్ భద్రతను ప్రోత్సహించే లక్ష్యంతో రష్మిక మందన్న దేశవ్యాప్తంగా ప్రచారానికి నాయకత్వం వహించనుంది. సైబర్ క్రైమ్ బాధితురాలిగా రష్మిక వ్యక్తిగత అనుభవం ఈ కొత్త బాధ్యతలను మరింత బలపరిచిందని చెప్పొచ్చు. సైబర్ భద్రతపై దృష్టి సారించిన జాతీయ ప్రచారాలకు నాయకత్వం వహించాలని రష్మిక లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశం అంతటా పెరుగుతున్న సైబర్ నేరాల ముప్పును ఎదుర్కోవడానికి కఠినమైన చర్యల కోసం ఆమె ఇప్పుడు పని చేయనుంది. రష్మిక డీప్‌ఫేక్ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అయింది. ఈ విషయంలో ఆమె చాలా ఇబ్బంది పడింది. చివరికి దోషులు పట్టుబడ్డా ఈ సంఘటన బలమైన సైబర్ భద్రతా చర్యల తక్షణ ఆవశ్యకతను తెలియజేసింది.
Rajnikanth: రజినీకాంత్ ఇంటిని చుట్టుముట్టిన వరద నీరు?
ఇక రష్మిక ఈ అంశం మీద స్పందిస్తూ “మనకు మరియు భవిష్యత్తు తరాలకు సురక్షితమైన సైబర్‌స్పేస్‌ను రూపొందించడానికి ఏకం అవుదాం. నేను సైబర్ నేరాల నుండి మీలో మరింత అవగాహన తీసుకురావాలని, వాటి నుంచి మిమ్మల్ని రక్షించాలని కోరుకుంటున్నా, అందుకే నేను I4Cకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నా”నేను ఈ పరిస్థితిని స్వయంగా ఎదుర్కొన్నాను. ఈ సమస్యల గురించి అవగాహన పెంచడానికి, సానుకూల మార్పును తీసుకురావడానికి సైబర్ భద్రతను ప్రోత్సహించడానికి నేను అంకితభావంతో పని చేస్తా అని రష్మిక పేర్కొంది. 1930కి కాల్ చేయడం ద్వారా లేదా cybercrime.gov.inని సందర్శించడం ద్వారా సైబర్ నేరాలను రిపోర్ట్ చేసి భారత ప్రభుత్వం మీకు సహాయం చేయనివ్వండి అని ఆమె రాసుకొచ్చింది.