NTV Telugu Site icon

Rashmika Mandanna : గాయం నుండి కోలుకుంటున్న రష్మిక

Rashmika

Rashmika

‘ఛలో’ మూవీ తో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రష్మిక మందన్న తన అద్భుతమైన నటనతో మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ సినిమా సూపర్ హిట్ తో టాలీవుడ్ లో వరుస ఆఫర్లు దక్కించుకుంది రష్మిక.  ఆ తర్వాత ‘గీత గోవిందం’ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇందులో విజయ్ దేవరకొండకు జోడీగా నటించింది. వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి ఆడియన్స్ ఎంతగానో ఫిదా అయిపోయారు.

Also Read : Bollywood : బాలీవుడ్‌లో క్యూరియస్ కలిగిస్తున్న న్యూ పెయిర్స్

ఇక ఇప్పుడు ‘పుష్ప’, ‘పుష్ప 2’, ‘యానిమల్’ వంటి భారీ సినిమాల్లో నటించి ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది. ఈ చిత్రాలు భారీ కలెక్షన్స్ వసూలు చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేశాయి. ఇలా వరుస సక్సెస్ లతో నేషనల్ క్రష్ గా మారింది రష్మిక. పుష్ప 2 సక్సెస్ తో జోరు మీదున్న అమ్మడు ఇటీవల జిమ్ లో వ్యాయామం చేస్తుండగా  గాయపడిన విషయం అందరికీ తెలిసిందే. గాయం కారణంగా రష్మిక కొద్దీ రోజలు బెస్ట్ రెస్ట్ సూచించారు వైద్యులు. అయితే ఇప్పుడు ఇప్పుడే కోలుకొని తిరిగి మళ్ళీ తన తదుపరి చిత్రం షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’ షూటింగ్ లో తిరిగి జాయిన్ కాబోతుందట. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి, దీంతో పాటుగా ఆమె ‘కుబేర’ సినిమాలో కూడా నటిస్తుంది.

Show comments