Site icon NTV Telugu

‘జాతి రత్నాలు’ దర్శకుడితో రష్మిక మూవీ

Rashmika Mandanna

Rashmika Mandanna

కన్నడ లేడీ రష్మిక మండన్న కొంతకాలంగా తన స్టైల్, సార్టోరియల్ పిక్స్ తో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. వెండి తెరపై ఆమె నటనతో ప్రజల హృదయాలను గెలుచుకోవడమే కాకుండా తరచుగా ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తోంది. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ఈ నటి “మిషన్ మజ్ను”తో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. దీంతో అభిమానులు ఆమెను ‘నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా’గా పిలుస్తున్నారు.

Read Also : నోరా ఫతేహి అందానికి 30 మిలియన్ల మంది దాసోహం

ఇటీవల ఈ యంగ్ బ్యూటీ కోలీవుడ్‌లో “సుల్తాన్” చిత్రంతో అరంగేట్రం చేసింది. ఇందులో కార్తీ ప్రధాన పాత్ర పోషించాడు. ఈ సినిమా యావరేజ్ గా ఆడింది. తాజా సమాచారం ప్రకారం మరో ద్విభాషా చిత్రానికి రష్మిక గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది అంటున్నారు. తమిళ హీరో శివకార్తికేయన్ తొలి తెలుగు చిత్రంలో హీరోయిన్ గా నటించబోతోందని, మేకర్స్ ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది. దీనికి జాతి రత్నాలు దర్శకుడు కెవి అనుదీప్ దర్శకత్వం వహిస్తారు. నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించబోతున్నాడు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Exit mobile version