Site icon NTV Telugu

Rashmi Gautham : రష్మీ గౌతమ్‌ ఇంట విషాదం..

Rashmi Gautham

Rashmi Gautham

బుల్లితెరపై ప్రముఖ యాంకర్‌గా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అయితే.. ఆమె ఇంట్లో విషాదం నెలకొంది. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. రష్మీ గౌతమ్ కుటుంబంలో ఒక ముఖ్యమైన వ్యక్తి మరణించారు. అది ఎవరో కాదు.. రష్మీ అమ్మమ్మ. రష్మీ గౌతమ్ ఆమె అమ్మమ్మతో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేసింది. “మా హృదయాలు బాధతో బరువెక్కాయి. మా కుటుంబమంతా సమావేశమై మా అమ్మమ్మ ప్రమీలా మిశ్రగారికి చివరిసారిగా వీడ్కోలు పలికింది. ఆమె చాలా ధైర్యవంతురాలు. ఆమె ప్రభావం మాపై చాలా ఉంది. ఆమె జ్ఞాపకాలు మా హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఓ శాంతి” అని పోస్ట్‌ చేసింది రష్మీ గౌతమ్. ఆమెకు ధైర్యం చెబుతూ నెటిజన్లు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Also Read : Chaganti Koteswara Rao: చాగంటి కోటేశ్వరరావుకు టీటీడీ కీలక పదవి..

సినిమాలతో ఇండస్ట్రీకి పరిచయమైనా.. జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకుంది యాంకర్ రష్మీ గౌతమ్. ముఖ్యంగా బుల్లితెరపై సుడిగాలి సుధీర్ లవ్ ట్రాక్ తో ఈ బ్యూటీకి మంచి క్రేజ్ వచ్చింది. జబర్దస్త్ షోతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి రష్మీ గౌతమ్ యాంకరింగ్ చేస్తోంది. అంతే కాకుండా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. మూగ జీవాలను హింసించే వారి చర్యలను ఆమె సోషల్ మీడియా ద్వారా ఖండిస్తున్నారు. రష్మీ గౌతమ్ బుల్లి తెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా రాణించింది. చిన్న చిన్న పాత్రలతో తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆమె సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. అయితే వెండితెరపై ఆమెకు ఆశించిన విజయం దక్కలేదు.

Also Read : Raviteja: మాస్ మహారాజా బర్త్ డేకి స్పెషల్ గిఫ్ట్ ఉంటుందా?

Exit mobile version