బాలీవుడ్ లో పయనం మొదలు పెట్టి టాలీవుడ్ లో బిజీ అయిన అందాల రాశి… రాశీ ఖన్నా. అయితే, గత కొంత కాలంగా బబ్లీ బేబీ రూటు మార్చింది.కోలీవుడ్, బాలీవుడ్ వైపు ఎక్కువగా దృష్టి పెడుతోంది. తెలుగు సినిమాలు అంతగా చేస్తున్నట్టు కనిపించటం లేదు. కానీ, తమిళంలో వరుస చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. బాలీవుడ్ లో వెబ్ సిరీస్ లతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. షాహిద్ కపూర్, అజయ్ దేవగణ్ లాంటి స్టార్ హీరోల సరసన డిజిటల్ డెబ్యూ చేయబోతోంది!
Read Also : “కేజీఎఫ్-2” నుంచి బిగ్ సర్ప్రైజ్… ఎప్పుడంటే ?
రాశి గ్లామర్ షోకి వ్యతిరేకం ఏం కాదు. అయితే, ఇప్పటి వరకూ పెద్ద తెరపై మరీ హాట్ గా కనిపించలేదు. అవసరం అయినంత మాత్రమే కొసిరి కొసిరి వడ్డిస్తుంటుంది, వయ్యారి! అయితే, సొషల్ మీడియాలో మాత్రం రాశి రూటే సపరేటు…
రాశీ ఖన్నా గతంలో బికినీతో కనిపించటం సహా అన్ని రకాల ప్రయోగాలు చేసేసింది సొషల్ మీడియాలో. తాజాగా మరోసారి ఓ హాట్ పిక్ ఫ్యాన్స్ కోసం షేర్ చేసింది. ఎల్లో టాప్ అండ్ వైట్ ప్యాంట్స్ తో అదిరిపోయే ఫోజు ఇచ్చింది. నడుముని, పొట్టని తాళ్లతో బంధించి మరింత సెక్సీగా కనిపించే ప్రయత్నం చేసింది. అప్పుడప్పుడూ ఇలాంటి అందాల విందులు వడ్డించే ఈ ఉత్తరాది భామకి ఇన్ స్టాగ్రామ్ లో భారీ ఫాలోయింగే ఉంది. 7.1 మిలియన్ ఫాలోయర్స్ తో అందాల రాశి అమాంతం దూసుకుపోతోంది…