2023లో వచ్చిన ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ’ తర్వాత రణవీర్ సింగ్ ఖాతాలో పెద్ద హిట్ లేదు. ఆ లోటును ‘ధురంధర్’తో తీర్చుకోవడమే కాకుండా.. బాక్సాఫీస్ వద్ద ఘనంగా పునరాగమనం చేశాడు. ధురంధర్ అన్ని బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ.1000 కోట్లు వసూల్ చేసి.. పరుగులు పెడుతోంది. ధురంధర్ మేనియా మధ్య స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు సంబంధించిన ఓ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
కొన్ని సంవత్సరాల క్రితం ఐడ్రీమ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ… ‘అర్జున్ రెడ్డి (2017) సినిమా రీమేక్ చేయాలని నాకు ముంబై నుంచి కాల్స్ వచ్చాయి. కబీర్ సింగ్ (2019) చిత్రానికి నా మొదటి ఎంపిక రణవీర్ సింగ్. అయితే కొన్ని కారణాలతో రణవీర్ ఆ చిత్రం చేయడానికి తిరస్కరించారు. ఆపై కబీర్ సింగ్ పాత్ర షాహిద్ కపూర్ వద్దకు వెళ్లింది. షాహిద్ ట్రాక్ రికార్డ్ ఆందోళన కలిగించే విషయం. అతని సోలో సినిమాలు ఏవీ ఇంకా రూ.100 కోట్లు వసూలు చేయలేదు. అతని అత్యధిక వసూలు రూ.65 కోట్లు. షాహిద్‌తో మీరు ఈ సినిమా ఎందుకు చేస్తున్నారు?. రణ్‌వీర్ బాక్సాఫీస్ కలెక్షన్ ఎక్కువగా ఉన్నాయన్నారు. కానీ నాకు షాహిద్‌పై నమ్మకం ఉంది. అతను మంచి నటుడు’ అని అన్నారు.
Also Read: Realme 16 Pro 5G Launch: రియల్‌మీ ‘బాహుబలి’ ఫోన్ వచ్చేస్తోంది.. 2 రోజుల పాటు ఛార్జర్ అవసరం లేదు!
రణ్‌వీర్ సింగ్ సతీమణి, నటి దీపికా పదుకొనే కూడా సందీప్ రెడ్డి వంగా చిత్రంను తిరస్కరించిన విషయం తెలిసిందే. రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’ నుంచి దీపికా తప్పుకున్నారు. నివేదికల ప్రకారం.. 8 గంటల షిఫ్ట్, ఫీజు విభేదాల కారణంగా దీపికా ఈ ప్రాజెక్ట్ నంచి వైదొలిగారు. ఇది సందీప్ రెడ్డి వంగా, దీపిక మధ్య తీవ్ర వివాదానికి దారితీసింది. ఇది సినీ పరిశ్రమలో చర్చకు దారితీసింది. స్పిరిట్ సినిమాలో దీపిక స్థానంలో త్రిప్తి దిమ్రీ చేస్తున్నారు. ధురంధర్ సినిమాను వంగా ప్రశంసించిన విషయం తెలిసిందే. రణ్‌వీర్, వంగా త్వరలో ఓ ప్రాజెక్ట్‌లో కలిసి చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.
