Ranbir Kapoor: యాక్టింగ్‌కి రణ్‌బీర్ కపూర్ గుడ్‌బై? మరో పదేళ్లే అంటూ షాకింగ్ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ranbir Kapoor: కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే.. బాక్సాఫీస్ వద్ద రికార్డుల మీద రికార్డులు కొడుతున్న టైంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ ఊహించని బాంబు పేల్చారు. త్వరలోనే నటనకు గుడ్‌బై చెప్పేస్తానంటూ సంచలన కామెంట్స్ చేశారు. నితేశ్ తివారి భారీ పౌరాణిక చిత్రం ‘రామాయణ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ స్టార్ హీరో.. యాక్టర్‌గా తాను స్క్రీన్‌పై కనిపించేది ఇంకో పదేళ్లు మాత్రమేనని కుండబద్దలు కొట్టారు. ఆ తర్వాత నటనకు పూర్తిగా ఫుల్స్టాప్ పెట్టి, మెగాఫోన్ పట్టుకుని దర్శకత్వానికే పరిమితమవుతానని స్పష్టం చేశారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రణ్‌బీర్ బయటపెట్టిన ఈ రిటైర్మెంట్ ప్లాన్ ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలను, అభిమానులను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఇండస్ట్రీలో టాప్ స్టార్‌గా దూసుకుపోతున్న రణ్‌బీర్ యాక్టింగ్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకోవడం వెనుక బలమైన కారణమే ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “నటుడిగా నేను స్క్రీన్‌పై కొనసాగేది మరో పదేళ్లు మాత్రమే అనుకుంటున్నా. ఆ తర్వాత పూర్తిస్థాయిలో దర్శకత్వం వైపే దృష్టి సారిస్తాను. దర్శకుడిగా ఓ కొత్త కథను వెండితెరపై ఆవిష్కరించాలన్నదే నా జీవితాశయం” అని రణ్‌బీర్ స్పష్టం చేశారు. “సంవత్సరంలో నేను షూటింగ్‌ల కోసం పనిచేసేది కేవలం 100 నుంచి 125 రోజులు మాత్రమే. కాబట్టి కథలు రాసుకోవడానికి నాకు కావాల్సినంత సమయం దొరుకుతుంది. ఇప్పటికే నా ఫస్ట్ సినిమా కోసం కథ రాయడం మొదలుపెట్టాను” అని వెల్లడించారు. నా దర్శకత్వంలో నేను హీరోగా నటించే ఆలోచన లేదని తేల్చేశారు. “నేను డైరెక్ట్ చేసే సినిమాలో నన్ను నేను హీరోగా పెట్టుకోవాలనే ఉద్దేశం లేదు. ఇతర నటీనటులతోనే ఆ సినిమా తీస్తాను” అని స్పష్టం చేశారు.
Also Read
వచ్చే రెండు మూడేళ్లలోనే దర్శకుడిగా తొలి అడుగు వేయాలన్నది తన టార్గెట్ అని రణ్‌బీర్ పేర్కొన్నారు. తన డైరెక్షన్ డెబ్యూ ఎలా ఉండబోతోందో వివరిస్తూ “నా తొలి చిత్రం ఏ జానర్లో ఉంటుందనేది ఇప్పుడే కచ్చితంగా చెప్పలేను. కానీ క్లాసిక్ చిత్రాలైన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’, ‘ఇట్స్ ఏ వండర్ఫుల్ లైఫ్’ తరహాలో.. అలాగే స్టార్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ సినిమాల్లాగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అందమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ను తెరకెక్కించాలనేది నా కోరిక” అంటూ తన కలల ప్రాజెక్ట్ గురించి పంచుకున్నారు. డైరెక్టర్‌గా మారే ముందు కమిట్ అయిన భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తానని రణ్‌బీర్ చెప్పారు. బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ‘బ్రహ్మాస్త్ర 2’, ‘యానిమల్ 2’తో పాటు ‘రామాయణ: పార్ట్ 2’ షూటింగ్‌లను పూర్తి చేసిన వెంటనే.. అంటే రెండు మూడేళ్ల వ్యవధిలోనే తన తొలి డ్రీమ్ ప్రాజెక్ట్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. మరోవైపు ప్రస్తుతం ఆయన సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘లవ్ అండ్ వార్’లో అలియా భట్, విక్కీ కౌశల్‌లతో కలిసి నటిస్తున్నారు. ఈ భారీ చిత్రం వచ్చే ఏడాది జనవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలాంటి భారీ సినిమాలు లైన్లో ఉన్న టైంలోనే.. రణ్‌బీర్ నటనకు స్వస్తి పలికి డైరెక్టర్‌గా మారిపోతానంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం బాలీవుడ్ సర్కిల్స్‌లో పెను దుమారం రేపుతున్నాయి.
తాజావార్తలు
-
Ranbir Kapoor: యాక్టింగ్‌కి రణ్‌బీర్ కపూర్ గుడ్‌బై? మరో పదేళ్లే అంటూ షాకింగ్ కామెంట్స్!
-
Senior Stars : బాలీవుడ్ భామలతో చిందేయాల్సిందే అంటున్న సీనియర్ హీరోలు
-
PM Modi: ఈసారీ వాళ్ల మధ్యే నా దీపావళి.. ప్రధాని మోడీ కీలక ప్రకటన!
-
Kamal Haasan : 23 ఏళ్ళకూ అదే పాట పాడుతున్న కమల్ హాసన్
-
Rakul : రకుల్’ను కాపాడిన రామాయణ
ట్రెండింగ్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!