Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ranabali Trailer: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్లో వస్తున్న ప్రతిష్టాత్మక పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’. చరిత్ర పుటల్లో మరుగునపడిపోయిన ఒక విప్లవ యోధుడి గాథగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఫస్ట్ నుంచే సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో తాజాగా రిలీజ్ అయిన ‘రణబాలి’ అఫీషియల్ ట్రైలర్ ఇంటర్నెట్ను షేక్ చేస్తూ, బాక్సాఫీస్ వద్ద రాబోయే సునామీని ముందే పరిచయం చేసింది. ఈ ట్రైలర్ ద్వారా అసలు స్టోరీని అత్యంత ఉత్కంఠభరితంగా రివీల్ చేశారు మేకర్స్. భారతదేశాన్ని తీవ్ర కరవు కోరల్లోకి నెట్టి, దేశ ప్రజలను పీల్చి పిప్పిచేసిన బ్రిటిష్ పాలకుల దారుణాలకు వ్యతిరేకంగా సాగిన రక్తచరిత్రే ఈ సినిమా. అనంతపురం ప్రాంతానికి చెందిన సింగనమల బొబ్బిలి ‘రణబాలి’గా తెల్లదొరల దౌర్జన్యాలపై ఎదురొడ్డి నిలిచిన పోరాట యోధుడిగా విజయ్ దేవరకొండ ఈ సినిమాలో కనిపిస్తున్నారు. తన గడ్డపై తెల్లవారి ఆధిపత్యాన్ని కూలదోయడానికి ఆయన చేసిన నెత్తుటి తిరుగుబాటు ప్రతి ఒక్కరికీ గూస్బంప్స్ తెప్పించేలా ఉంది.
గతంలో ఎన్నడూ చూడని సరికొత్త గెటప్‌లో విజయ్ దేవరకొండ ఈ సినిమాలో తన కెరీర్ బెస్ట్ యాక్టింగ్‌ను కనబరిచినట్లు తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్‌ను బట్టి స్పష్టమవుతోంది. ముఖ్యంగా రాయలసీమ యాసలో ఆయన పలికిన డైలాగ్స్, చేసిన యాక్టింగ్ వెండితెరపై వసూళ్ల తుఫాను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు ‘జయమ్మ’ అనే బలమైన పాత్రలో రష్మిక మందన్న నటన ట్రైలర్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీరిద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ సినిమా స్థాయిని మరింత పెంచింది. విజువల్స్‌కు తగ్గట్టుగా అజయ్-అతుల్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఉత్కంఠను రేపుతూ సినిమాకు ప్రధాన బలంగా మారింది. అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతున్న ‘రణబాలి’.. టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలతో పాటు సినీ ప్రియులు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
- Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
- Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
- SS Rajamouli: బాహుబలి ‘కిలికి’ని మించేలా జక్కన్న సరికొత్త ప్రయోగం?
- God of War: ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై త్రివిక్రమ్ నిర్లక్ష్యం? 'గాడ్ ఆఫ్ వార్' సంగతేంటి!
తాజావార్తలు
-
Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!
-
Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
-
Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!