Ranabali OTT Release Date: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన క్రేజీ మూవీ ‘రణబాలి’ థియేటర్లలో సందడి చేసిన తర్వాత ఇప్పుడు నేరుగా మీ ఇంట్లోకి వచ్చేస్తోంది ఈ సినిమా. థియేటర్లలో చూడటం మిస్సయిన వాళ్లతో పాటు, ఇంట్లోనే హాయిగా ఎంజాయ్ చేయాలనుకునే సినీ ప్రియుల కోసం ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో నవంబర్ 13 నుంచి ‘రణబాలి’ స్ట్రీమింగ్ కానుంది. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ ఒకేసారి అందుబాటులోకి తెస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 80 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించగా, రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కించారు.
కథ:
ఈ సినిమా అంతా 1854 నుంచి 1878 మధ్యలో జరుగుతూ ఉంటుంది. సింగనమల బొబ్బిలి రణబాలి (విజయ్ దేవరకొండ) ఆ ఊరి పాలెగాడి కుటుంబంలో జన్మించిన వారసుడు. ఊపిరి లేకుండా పుట్టిన రణబాలికి ఆ కుటుంబం కొంగుబంగారంగా కొలిచే భద్రమల్లన్న స్వామి ఊపిరి పోసి, రెండు పుష్కరాల వరకు అతనికి ఆయుష్షు ఉంటుందని దీవించి పంపుతాడు. అలా భద్రమల్లన్న స్వామి ఆయుష్షుతో పెరిగిన రణబాలి తన ప్రజలందరికీ అండగా నిలబడుతూ ఉంటాడు. అయితే, ఎప్పుడూ తాగుతూ బాధ్యత లేకుండా తిరిగే రణబాలికి జయమ్మ(రష్మిక)తో పెళ్లి చేస్తారు. ఈ క్రమంలో జయమ్మ అతన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉండగా, కరువు కారణంగా మద్రాసు ప్రాంతమంతా ఎంత ఇబ్బంది పడుతుందో రణబాలి తెలుసుకుంటాడు. ఆ తర్వాత బాధ్యత లేకుండా తిరిగిన రణబాలి, కరువు పీడిత ప్రజలందరికీ ఎలా అండగా నిలబడ్డాడు? అతను ఎందుకు వారికి అండగా నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది? చివరికి ఏం జరిగింది? అనేదే ఈ సినిమా కథ.

