Site icon NTV Telugu

Rana Daggubati: కొత్త అవతారమెత్తుతున్న రానా

Rana

Rana

దగ్గుబాటి రామానాయుడు మనవడిగా సినీ రంగ ప్రవేశం చేసిన రానా, తర్వాత కాలంలో హీరోగా ఎన్నో సినిమాలు చేశాడు. ఎన్నో సినిమాలు హిట్స్ కొట్టగా, కొన్ని సినిమాలు ఫ్లాప్స్ కూడా అయ్యాయి. అయితే, ఆయన చేస్తున్న రెండు సినిమాలు దాదాపుగా షెడ్యూల్‌కి వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ మధ్యనే ఆయన చేసిన ‘రానాయుడు’ సెకండ్ సీజన్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

Also Read:Allu Arjun: అల్లు అర్జున్ ‘శక్తిమాన్’పై పెదవి విప్పిన డైరెక్టర్!

అయితే, మరోపక్క ఆయన దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ‘కాంత’ అనే సినిమాకి సహ-నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మధ్యనే సినిమా షూటింగ్ కూడా మొదలైంది. ఈ సినిమాలో సహ-నిర్మాతగా వ్యవహరించడమే కాక, నటుడిగా కూడా ఒక పాత్ర చేయబోతున్నాడు రానా. ఈ సినిమాలో ఆయన ఒక డిటెక్టివ్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

Also Read:SahaKutumbhanam: ఆసక్తి రేకెత్తించేలా ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ “స:కుటుంబానాం” టీజర్.

ఇప్పటికే రానా దగ్గుబాటి తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేశాడు. సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా దాదాపు ముగిసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి సినిమాకి సంబంధించిన డబ్బింగ్ పనులు పూర్తవుతున్నాయి. సెల్వం సెల్వరాజు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ ఏడాది త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి టీజర్ రిలీజ్ చేసే పనిలో ఉన్నారు. సినిమాని దుల్కర్ సల్మాన్‌తో కలిసి రానా దగ్గుబాటి నిర్మిస్తుండడం గమనార్హం.

Exit mobile version