Ramyakrishna : 12 మంది లవ్ ఫెయిల్యూర్స్’తో రమ్యకృష్ణ డేటింగ్ షో?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అలనాటి స్టార్ హీరోయిన్ ‘రమ్యకృష్ణ’ రియాలిటీ షో హోస్ట్‌గా సరికొత్త ప్రయాణం స్టార్ట్ చేశారు. ‘బాహుబలి’తో మమతల తల్లి శివగామిగా పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న ఈ సీనియర్ నటి, ఇప్పుడు ‘జియో హాట్‌స్టార్’ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానున్న ఓ తమిళ్ డేటింగ్ షోకి హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ‘సెకండ్ లవ్’ అనే పేరుతో త్వరలో ప్రారంభం కానున్న ఈ రియాలిటీ రొమాన్స్ సిరీస్‌లో ఆల్రెడీ బ్రేకప్ అయినా, 30 ఏళ్ళ లోపు ఉన్న 12 మంది సింగిల్స్‌ను ఓ విల్లాలోకి పంపించి.. అక్కడ వారికీ సెకండ్ లవ్ వెతుక్కునే సందర్భాలను క్రియేట్ చేస్తారు.
వినడానికి కాస్త వెరైటీగా ఉన్న ఈ రియాలిటీ షో, నేటి జెన్ జి కిడ్స్ను ఏ మేరకు ప్రభావితం చేస్తుందో తెలియాలంటే షో స్ట్రీమింగ్ వరకు ఆగాల్సిందే. తాజాగా విడుదలైన ఈ షోకు సంబంధించిన పోస్టర్లో ‘రమ్యకృష్ణ’ బ్రేకప్ అయిన హార్ట్ సింబల్‌కు ప్యాచ్ అప్ చేస్తూ, చూపిస్తున్న పోజ్‌లో కనిపించగా.. ఆమె ఆ పోస్టర్లో 90స్ హీరోయిన్లా కాకుండా, నేటి జెన్ జి హీరోయిన్స్‌కి పోటీ ఇచ్చే యంగ్ హీరోయిన్గా కనిపిస్తున్నారు అని కామెంట్స్ వస్తున్నాయి.
Also Read
అయితే, కేవలం తమిళ జియో హాట్‌స్టార్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్‌లోనే అనౌన్స్మెంట్ చేసిన షో నిర్వాహకులు, తెలుగులో కూడా సేమ్ హోస్ట్‌తో స్ట్రీమింగ్ స్టార్ట్ చేస్తారో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇప్పటికే ‘రమ్యకృష్ణ’ కో-యాక్టర్స్ అయిన కింగ్ ‘నాగార్జున’, ‘జగపతి బాబు’, ‘బాలయ్య’ వంటి వారు అనేక టీవీ రియాలిటీ షోస్‌కి హోస్ట్‌గా వ్యవహరిస్తూ, ప్రతి సంవత్సరం ఆడియన్స్‌ను అలరిస్తూనే ఉన్నారు.
అలాగే, తాజాగా స్ట్రీమింగ్ అయిన ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్’, కుకింగ్ షోస్ మొదలగు రియాలిటీ షోస్ ద్వారా కూడా అలనాటి హీరోయిన్స్ అయిన ‘లయ’, ‘రాధా’, ‘ముచ్చర్ల అరుణ’ వంటి వారు తెలుగు ప్రేక్షకులను మరోసారి పలకరించేశారు. మరి అదే తరహాలో ‘రమ్యకృష్ణ’ కూడా ఈ తమిళ రియాలిటీ రొమాన్స్ సిరీస్‌తో ఏ మేరకు ప్రశంసలు అందుకుంటారో వేచి చూడాలి.
మరో కోణంలో, ఇది ఓ డేటింగ్ షో కాబట్టి ఈ సిరీస్‌కు ప్రశంసలతో పాటు విమర్శలు కూడా అంతే రేంజ్లో వచ్చే అవకాశం లేకపోలేదు. అంతేకాదు, ఈ తరహా డేటింగ్ షోస్ అనేవి ఇక్కడ సౌత్‌లో కొత్త, కానీ అక్కడ నార్త్‌లో ‘ఎంటివి స్ప్లిట్స్‌విల్లా’ పేరుతో అనేక సీజన్స్ నడిచాయి, నడుస్తున్నాయి. మరి చూద్దాం, ‘రమ్యకృష్ణ’ సెకండ్ ఇన్నింగ్స్‌లో స్టార్ట్ చేసిన ఈ ‘సెకండ్ లవ్’ ఏ మేరకు వర్క్ అవుట్ అవుతుందో.
తాజావార్తలు
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!
-
Gaddam Prasad: “చర్యలు తీసుకుంటాం”.. స్పీకర్‌ను పరామర్శించిన సీఎం, డిప్యూటీ సీఎం..
-
Citizen Vigilante: హింసకు భయపడి జర్మనీ ఆపేసిన సినిమా.. ఎలాన్ మస్క్ ఎంట్రీతో ఒక్కసారిగా..!
-
Dragan : డ్రాగన్.. రంగంలోకి దిగిన లూగర్
-
TDP Leadership Conclave: నీళ్లు, పరిశ్రమలు, ఉద్యోగాలు.. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు భారీ బ్లూప్రింట్
ట్రెండింగ్
-
Elon Musk: ఇక 5 – 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!