Rambha : వారి కోసమే ఇండస్ట్రీకి దూరం అయ్యా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నైంటీస్‌లో తెలుగు సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన కథానాయికల్లో రంభ ఒకరు. అసలు పేరు విజయలక్ష్మి అయినప్పటికి స్క్రీన్ నేమ్‌ను రంభగా మార్చుకుంది. ‘ఆ ఒక్కటి అడక్కు’ మూవీతో ఎంట్రీ ఇచ్చి తొలి చిత్రంతోనే మంచి ఫేమ్ సంపాదించుకుంది. తర్వాత ‘బావగారు బాగున్నారా’ తో సహా ఎన్నో పెద్ద సినిమాల్లో నటించి టాప్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. తమిళంలో సైతం పలు చిత్రాల్లో నటించిన రంభ.. దాదాపు అందరు స్టార్ హీరోలతో జత కట్టింది. చివరగా దేశముదురులో ఐటెం సాంగ్‌లో కనిపించిన రంభ.. ఆపై పెళ్లి, పిల్లలు అలా వ్యక్తిగత జీవితంలో సెటిలైపోయింది.
Also Read : Robinhood : అప్పుడే ఓటీటీలోకి ‘రాబిన్‌హుడ్’ మూవీ..
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
అయితే ప్రజంట్ సీనియర్ హీరోయిన్ లాగే ఆమె కూడా సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించాలనుకుంటోంది. అక్క, వదిన, తల్లి తరహా పాత్రలు చేయడానికి రంభ రెడీ అవుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇటీవలే ఒక టీవీ షోకు జడ్జిగా కూడా వచ్చిన రంభ. ఈ నేపథ్యంలో తన సెకండ్ ఇన్నింగ్స్ గురించి రంభ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది..‘పెళ్లి తర్వాత నేను కెనడాలో స్థిరపడ్డాను. కుటుంబం, పిల్లల కోసమే సినిమాలకు దూరమయ్యాను. నా పిల్లలకు ఒక వయసు వచ్చే వరకు తల్లిగా బాధ్యతగా ఎంతైనా ఉంటుంది. ఇక ఇప్పుడు మా బాబుకి ఆరేళ్లు. అమ్మాయిలకు 14, 10 ఏళ్లు. ప్రస్తుతం ఎవరి పనులు వాళ్లు చేసుకోగలుగుతున్నారు. నాకు మూవీస్ మీద ఉన్న ఆసక్తి గురించి నా భర్తకు తెలుసు. అందుకే మళ్లీ నటిస్తానంటే ఒప్పుకున్నారు. ముందుగా ఒక డ్యాన్స్ షోకు జడ్జిగా చేశాను. ఎందుకో తెలిదు అప్పుడు చాలా భయపడ్డాను. కానీ షో సాఫీగా సాగిపోయింది. ప్రేక్షకుల చప్పట్లు నాలో మళ్లీ ఉత్సాహం నింపాయి. నటన నా రక్తంలోనే ఉంది. మళ్లీ నటించడానికి రెడీగా ఉన్నాను. నాతో కలిసి నటించిన చాలామంది ఇంకా ఇండస్ట్రీలో ఉన్నారు.. నా చేతిలో ప్రజంట్ కొన్ని ఆఫర్ లు కూడా ఉన్నాయి. త్వరలోనే నేను నటించే సినిమాను ప్రకటిస్తా’ అని తెలిపింది రంభ.
తాజావార్తలు
-
Porsche Cayenne Electric: Porsche Cayenne Electric భారత్‌లో లాంచ్.. 623 కి.మీ రేంజ్, 2.5 సెకన్లలో 100 kmph
-
PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
Smit Machchhar: ‘రియల్ హీరో’.. యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది.. భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌పై నెతన్యాహు ప్రశంసలు
ట్రెండింగ్
-
1,600 నిట్స్ డిస్‌ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!